స్కూల్ లిఫ్ట్ లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి మృతి…

door-lift

హైదరాబాద్: హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ రెవేన్యూబోర్డు కాలనిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ లిఫ్ట్ లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి ఫాతిమా జఫ్రి అక్కడికక్కడే మరణించింది. లిఫ్ట్ లోని గ్యాప్ లో చిక్కుకోవడంతో చిన్నారి తల తెగిపోయింది. మంగళవారం ఉదయం స్కూల్ కు వెళ్లిన ఫాతిమా జఫ్రి.. పైఅంతస్తులోని తరగతి గదికి లిఫ్ట్ లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చిన్నారి శరీరం లిఫ్ట్ గ్యాప్ లో లో ఇరుక్కోవడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. మరణించిదన్న వార్త తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నిరవుతున్నారు. పాఠశాల సిబ్బంది యాజమాన్యం వల్లే ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *