
తెలంగాణ ప్రభుత్వం స్కాలర్ షిప్ ల కోసమే నడుస్తున్న ప్రైవేటు ఇంజనీరింగ్ కళశాలలపై చర్యలు సిద్ధమైంది. ఈ మేరకు సమీక్ష నిర్వహించిన కేసీఆర్ బోగస్ కాలేజీల పనిపట్టాలని ఆదేశించారు. స్కాలర్ షిప్ ల కోసం బోగస్ విద్యార్థులను, అధ్యాపకులను లేనివారిని ఉన్నట్టు చూపించి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని అవసరమైతే ఆ కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని ఆదేశించారు.
బోగస్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు నష్టం కలుగకుండా ఉండేందుకు వారిని ఇతర కాలేజీల్లో చేర్పించాలని ఆదేశించారు. నాణ్యమైన ప్రమాణాల కోసం రాజీపడవద్దని ఆదేశించారు. ఇప్పటికే ప్రైవేటు కాలేజీలకు చెల్లించాల్సిన బోధన రుసుం దాదాపు 3300 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ ఆదేశించారు.