Breaking News

స్కాట్లాండ్ పై అప్ఘనిస్తాన్ విజయం

hamid-hassan-of-afghanistan-celebrates-8

హైదరాబాద్, ప్రతినిధి : ప్రపంచకప్ ఈ రోజు రెండు పసికూనల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా నరాలు తెగేలా సాగింది. న్యూజిలాండ్ లోని డునెడిన్ వేదికగా స్కాట్లండ్ – ఆప్ఘనిస్తాన్ లు ఈ రోజు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య చేధనలో మొదట తడబడిన ఆప్ఘనిస్తాన్ అనంతరం కోలుకొని విజయం మరో మూడు బంతులు మిగిలి ఉండగా చావుతప్పి కన్ను లొట్ట బోయినట్టు చివరి వికెట్ కు విజయం సాధించింది.

ఒకనొక దశలో ఆప్ఘనిస్తాన్ 97 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడగా.. అప్ఘన్ బ్యాట్స్ మెన్ షెన్వారీ అద్భుతంగా ఆడి 147 బంతుల్లో 97 పరుగులు చేసి బంగ్లాకు ఒంటిచేత్తో విజయాన్నిందించాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *