Breaking News

సౌతాఫ్రికాపై ఇండియా ఘన విజయం

india-team-jubilation

ఆస్ట్రేలియా : అసలు ఇది ఇండియా టీమేనా.. మొన్నటి దాకా ఆస్ట్రేలియా పర్యటనలో మూడునెలలుగా ఒక్క విజయం సాధించక మొహం వాచిన టీమిండియా ప్రపంచకప్ లో మాత్రం తన అటతీరుతో అందరినీ విస్మయ పరుస్తోంది. మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తు చేసిన భారత్ .. ఇప్పుడు బలమైన దక్షిణాఫ్రికాను మట్టికరిపించి ఔరా అనిపించింది.

టీమిండియా అంచనాలను మించి రాణిస్తూ ఆల్ రౌండ్ షోతో అదరగొడుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లో విజయం సాధించింది. ప్రపంచకప్ లో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా పై ఒక్క మ్యాచ్ గెలవని భారత్ ఆదివారం చరిత్రను తిరగరాసింది. ధవన్ (146 బంతుల్లో 137 పరుగులు) బ్యాటింగ్ తో అదరగొట్టి సెంచరీ సాధించడంతో పాటు బౌలర్లు బౌలింగ్ సమష్టిగా రాణించడంతో దక్షిణాఫ్రికాపై ఇండియా ఘన విజయం సాధించింది. ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. తాజా విజయంతో భారత్ ఫుల్ బి లో అగ్రస్థానానికి చేరింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ధావన్ 137, రహానే (79), హాఫ్ సెంచరీ చేశారు. కోహ్లీ 46 పరుగులు చేశారు. అనంతరం 308 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి కకావికలమైంది. 40.2 ఓవర్లలోనే 177 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *