
దురదృష్టకర జట్టంటే సౌతాఫ్రికానే.. నిజంగా ఆ జట్టును సంవత్సరాలుగా దురదృష్టం వెంటే ఉంటోంది. 1990 నుంచి ఆ జట్టు నాకౌట్ గెలిచిన చరిత్ర లేదు. ఈసారి క్వార్టర్ ఫైనల్ లో నాకౌట్ మ్యాచ్ లో శ్రీలంకపై ఘన విజయం సాధించి కొంత ఆ గండం నుంచి గట్టెక్కినా సెమీస్ లోకి వచ్చేసరికి మళ్లీ దురదృష్టం వారినెత్తిపైనే నాట్యమాడింది.
మంగళవారం జరగిన మ్యాచ్ ఆ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వర్షం పడి చావు దెబ్బతీసింది. క్రీజులో అరవీర భయంకర డివిలీయర్స్, మిల్లర్ ఉన్నారు. వారిద్దరు స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నారు. 43 ఓవర్లు కాకుండా మ్యాచ్ 50 ఓవర్లు జరిగి ఉంటే సౌతాఫ్రికా 350పైన స్కోరు సాధించి విజయం సాధించి ఉండేది. కానీ 291 పరుగులకే పరిమితమైంది. బ్యాటింగ్ వాన అడ్డపడితే .. ఇక ఫీల్డింగ్ లో ఒత్తిడి జయించలేని జట్టులా మళ్లీ కనపించింది. క్యాచ్ లు, రన్ ఔట్లు మిస్ చేసి ఒత్తిడి లో ఆడలేరని అపవాదును సౌతాఫ్రికా ఆటగాళ్లు మళ్లీ నిరూపించుకున్నారు. కనీసం 3 క్యాచ్ లు, 3 రన్ ఔట్లు మిస్ చేశారంటే వారి దురదృష్టం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ మ్యాచ్ ఒక్కటే కాదు.. 1990 నుంచి ఆ జట్టుది ఇదే కథ..ప్రతీసారి నాకౌట్ కు చేరడం .. ఇలా ప్రకృతి పతాపమో.. ఆటగాళ్లు ఒత్తిడితో ఓడిపోతూనే ఉన్నారు. అందుకే సెమీస్ చేరినా సౌతాఫ్రికా ఫైనల్ చేరుతుందని ఎవరూ అనలేదు.. ఎందుకంటే నాకౌట్ లో గెలిచిన చరిత్ర ఆ జట్టుకు లేదు. అన్నీ అననుకూలతలను నెత్తిన పెట్టుకొని ఓడిపోయిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మ్యాచ్ ఓడిపోగానే స్టేడియంలోనే కన్నీళ్లపర్యంతం అవడం నిజంగా విషాదం..