Breaking News

సోమేష్ ఏపీకి పోను అనేది అందుకే..

chandrababu somesh

సోమేశ్ కుమార్.. జీహెచ్ఎంసీ కమిషనర్.. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం ముగిసిపోవడంతో సీఎం అండదండలతో విప్లవాత్మక మార్పులు తెస్తూ హైదరాబాద్ పాలకుడిగా.. సమర్ధ అధికారిగా పేరుతెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయనకు కష్టాలు వచ్చాయి..

సోమేష్ కుమార్ ఐఏఎస్ విభజనలో భాగంగా ఏపీకి కేటాయించబడ్డారు. కానీ ఆయన ఏపీకి పోకుండా సీఎం కేసీఆర్ అండదండలతో జీహెచ్ఎంసీ కమిషనర్ గానే కొనసాగుతున్నారు. ఏపీకి నన్ను కేటాయించవద్దంటూ క్యాట్ లో పిటీషన్ వేశారు. క్యాట్ నిన్న తీర్పు ఇచ్చింది. ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి సోమేశ్ ను కేటాయించిందని.. వెళ్లాల్సిందేనని తీర్పు ఇచ్చింది. దీంతో సోమేష్ కు అసలు కష్టాలు ఎదురుకానున్నాయి.

జీహెచ్ఎంసీ కమిషనర్ గా సోమేష్ కుమార్ సీఎం కేసీఆర్ కు వెన్నుదన్నుగా ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి హైదరాబాద్ లో పర్మిషన్ ఇవ్వలేదు.. స్వామి భక్తి చాటుకున్న చంద్రబాబుకు కోపం తెప్పించిన సోమేశ్ .. ఇప్పుడు అదే సోమేశ్ ఏపీ ప్రభుత్వంలో పనిచేయాల్సిందే.. ఇక చంద్రబాబును టార్చర్ పెట్టిన సోమేశ్ కు ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఎదురుకాబోతాయో నన్న ఉత్కంఠ ఐఏఎస్ లలో నెలకొంది. అందుకే సోమేశ్ ఏపీకి పోనంటే పోనంటున్నాడట.. ఏమవుతుందో చూడాలి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *