
హైదరాబాద్ : చాలా రోజులుగా హైదరాబాద్ నగర జీహెచ్ఎంసీ కమిషనర్ గా అట్టిపెట్టుకొని పనిచేస్తున్న సోమేష్ కుమార్ కు ఎట్టకేలకు సీఎం కేసీఆర్ స్వస్తి పలికారు. ఈ మధ్య కాలంలో సోమేష్ తీసుకుంటున్న చర్యల వల్ల తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ఓట్ల తొలగింపు నిర్ణయంతో ప్రభుత్వం అభాసుపాలైంది. దాంతో పాలనను చక్కదిద్దాడినికి కేసీఆర్ ప్రభుత్వం నిన్న రాత్రి ప్రిన్సిపల్ సెక్రటరీల స్థాయి ఐఏఎస్ ల బదిలీలను భారీగా చేపట్టింది. దాదాపు ముఖ్యుల అందరి శాఖలు మార్చింది..
జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న సోమేశ్ కుమార్ ను గిరిజిన సంక్షేమశాఖ కమిషనర్ గా బదిలీ చేసింది.. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్ గా జనార్ధన్ రెడ్డిని నియమించింది.