సోమారపు సత్యనారాయణకు మద్దతు

సోమారపు సత్యనారాయణకు మద్దతు

తాజా మాజీ ఎమ్మెల్యే, రామగుండం నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు సింగరేణి యూనియన్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. సింగరేణి డ్రైవర్స్, ఈసీ ఆపరేటర్స్ యూజీ ఆల్ ట్రేడ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు సోమారపు సత్యనారాయణను కలిశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేశారని, మరోసారి సీఎం కోరుకుంటున్నామని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చారని పేర్కొన్నారను. సింగరేణి ఎన్నికల్లో కూడా టీజీజీకేఎస్ కు యూనియన్ పరంగా మద్దతు తెలిపామన్నారు. ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు , రామంగుడం అభ్యర్థిగా బరిలో నిలిచిన సోమారపు సత్యనారాయణకు మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షఉడు షేక్ మీరా, వైస్ ప్రెసిండెంట్ కోల కనుకయ్య, కోశాధికారి కటకం కమలాకర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఐరేని ఉదయ్ కుమార్, ఆర్జీ-1 ప్రెసిడెంట్ కటకం రఘు తదితరులు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *