Breaking News

సోనూ శాశ్వత నిద్రలోకి..

bear

అది  మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గల కమలా నెహ్రూ జంతు ప్రదర్శన శాల.. అక్కడే మూడేళ్లుగా ఉంటున్న సోను అనే ఎలుగుబంటి ముసలది అయిపోయింది. ఎలుగుబంటి మూడేళ్లుగా పక్షవాతంతో బాధపడుతోంది.. అరుదైన హిమాలయన్ రకానికి చెందిన ఈ ఎలుగుబంటి సోను 33 ఏళ్లుగా జూలో సేవలందిస్తోంది. కాగా ఇప్పుడు అది వృద్ధాప్యంతో అంపశయ్యకు చేరింది..

దీంతో దానికి కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని .. ఎంత వైద్యం చేసినా దాని ఆరోగ్యం మెరుగుపడడం లేదని భావించి ఢిల్లీలోని కేంద్ర జంతుప్రదర్శన శాల, ఇతర అధికారుల అనుమతి తీసుకున్నారు.

అనంతరం జూలో నిన్న చివరి రోజు కదలలేని దానికి ఇష్టమైన ఆహారం ఇచ్చి ఇంజక్షన్ ఇచ్చి చంపేశారు.. దీంతో సోనూ శాశ్వత నిద్రలోకి జారిపోయింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *