సోనియా, రాహుల్ లకు బెయిల్ మంజూరు

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పాటియాల హౌస్ కోర్టు శనివారం రాహుల్ సోనియాలకు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు చెరో రూ.50వేల ష్యూరిటీని సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.. విచారణ నిమిత్తం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సోనియా, రాహుల్ కోర్టుకు హాజరయ్యారు. వీరి తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా పడింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *