Breaking News

సొంతూరు పర్వతగిరిలో కేజీబీవీ విద్యార్థులకు హెల్త్ కిట్స్ అందించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

సొంతూరు పర్వతగిరిలో కేజీబీవీ విద్యార్థులకు హెల్త్ కిట్స్ అందించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం

సన్నబియ్యం, సకల వసతులతో పాటు ఆరోగ్య రక్షణ హెల్త్ కిట్స్ అందిస్తున్నాం

వారం రోజుల్లో విద్యార్థినిలకు హీట్ వాటర్ ప్లాంట్ అమర్చాలని అధికారులకు
ఆదేశం

సొంత ఖర్చుతో టీవీ ఏర్పాటు చేస్తానని హామీ

పేదరికం నుంచే వచ్చాను…అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఈ స్థాయికి వచ్చాను

సొంతూరు పర్వతగిరిలో కేజీబీవీ విద్యార్థులకు హెల్త్ కిట్స్ అందించిన ఉప
ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

హైదరాబాద్, జనవరి 03: విద్యార్థులకు విద్యాపరంగా అన్నివసతులు కల్పించడమే కాకుండా వారి ఆరోగ్య రక్షణ కూడా ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, అందుకే సన్నబియ్యం, పోషకాహారంతో కూడిన మెను ఇవ్వడంతో పాటు ఆరోగ్యపరిరక్షణకు హెల్త్ కిట్స్ అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సొంత గ్రామం పర్వతగిరిలోని కేజీబీవి విద్యార్థులకు నేడు హెల్త్ కిట్స్ పంపిణీ చేశారు. చలికాలం ఉన్నందున విద్యార్థులకు స్నానాలకు వేడినీటి సౌకర్యం కల్పించేందుకు వారం రోజుల్లో హీట్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. దాంతో పాటు ఆర్వో ప్లాంట్ కూడా అమర్చాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.

kadiyam srihari 1

మానవ వనరుల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమని, ఆ మానవ వనరులు విద్యవల్లే అభివృద్ధి అవుతాయని ముఖ్యమంత్రి కేసిఆర్ పదే, పదే చెబుతుంటారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలను సిఎం కేసిఆర్ తెలంగాణలో ఏర్పాటుచేశారన్నారు. 194 మోడల్ స్కూల్స్, 475 కేజీబీవీలు, 840 గురుకులాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో రెసిడెన్షియల్ విధానంలో 1450కి పైగా విద్యాలయాల్లో 8 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు. ఆడపిల్లలకు వచ్చే ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వ పరంగా 300 రూపాయల విలువ చేసే హెల్త్ మరియు హైజీన్ కలిగిన ఆరోగ్య పరిశుభ్రత కిట్స్ ను అందజేస్తున్నామన్నారు.

పర్వతగిరి తాను పుట్టిన గ్రామమని, ఇక్కడే అతిపేద కుటుంబంలో పుట్టిన తాను
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్పూర్తితో చదువుకుని, ఆయన కల్పించిన రిజర్వేషన్ల
వల్ల నేడు ఈ స్థాయికి వచ్చానన్నారు. విద్యార్థులు కూడా పేదవాళ్లమని ఎవరూ
బాధకూడదని, ఈ ప్రభుత్వం మీకు కావల్సిన అన్ని వసతులు కల్పిస్తుందని హామీ
ఇచ్చారు. వారం రోజుల్లో కేజీవీవికి సోలార్ ఫెన్సింగ్, గ్రౌండ్ లెవెలింగ్ చేయించాలని అధికారులను ఆదేశించారు. తన సొంత ఖర్చుతో టీవీని ఏర్పాటు చేయిస్తానన్నారు. విద్యార్థులకు విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాలన్నారు. విద్యార్థులకు పోషక విలువలు కూడిన భోజనం అందించేందుకు ఈ జనవరి 1వ తేదీ నుంచి అందరికీ ఒకేరకమైన మెనును రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు.

kadiyam srihari 2

ఈ మెనులో ఉదయం ఆరు గంటలకే 250 మిల్లీ లీటర్ల పాలు, ఉదయం 9 గంటలకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్,  సాయంత్రం స్నాక్స్, రాత్రిభోజనం అందిస్తున్నామన్నారు. వారానికి నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మటన్, ప్రతి రోజు గుడ్డును విద్యార్థులకిస్తున్నామని చెప్పారు. వీటితో పాటు నెయ్యి కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ సంవత్సరం వచ్చేపరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉన్నత స్థాయికి రావాలన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *