
సీఎం కేసీఆర్ తన సొంతూళ్లపై అలివిమాలిన ప్రేమ కనబరుస్తున్నారు. సిద్ధిపేట, గజ్వేల్ లకు దేవాదుల ఎత్తిపోతల ద్వారా నీరు తీసుకొచ్చి సస్యశ్యామలం చేసేందుకు ప్లాన్ గీశారు.ఈ రెండు సెగ్మెంట్ల పరిధిలోని 16 గ్రామాల్లోని 15వేల ఎకరాలకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా పథకాన్ని నిర్మించి ఈ మేరకు ప్రాజెక్టు నిర్మించేందుకు అంగీకారం తెలిపారు.
కాగా ఈ సాగునీటితో గజ్వేల్ లోని సీఎం ఫాం హౌస్ కూడా ఉండడం ఆయనకు మేలు చేయబోతోంది. మొత్తానికి సీఎం తనసొంత నియోజకవర్గాలపై ఎక్కువ ప్రేమ కనబరుస్తున్నట్లే కనిపిస్తోంది..