‘సైజ్ జీరో’ సెన్సార్ కంప్లీట్…

ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యాన‌ర్‌ఫై అనుష్క‌, ఆర్య ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘సైజ్ జీరో’. ఈ చిత్రం క్యారెక్ట‌ర్ అనుష్క 20 కిలోల బ‌రువు పెర‌గ‌డం అనుష్కకు సినిమాల ప‌ట్ట ఉన్న క‌మిట్‌మెంట్‌ను తెలియ‌జేసింది. అనుష్క ఇలాంటి డిఫ‌రెంట్ రోల్ చేయ‌డంతో సినిమాపై ప్రేక్ష‌కుల్లో, ట్రేడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తి పెరిగింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ చిత్రం న‌వంబ‌ర్ 27న గ్రాండ్ లెవ‌ల్‌లో విడుద‌ల‌వుతుంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని;యు/ఎ; సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. ‘బాహుబ‌లి’, ’రుద్ర‌మ‌దేవి’ చిత్రాలు త‌ర్వాత అనుష్క చేస్తున్న‌చిత్రం ‘సైజ్ జీరో’. సినిమా ప్రారంభం నుండి సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. త‌మిళంలోఇంజి ఇడుప‌ళ‌గి అనే పేరుతో త‌మిళంలో, సైజ్ జీరో పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, నార్త్ ఇండియా, యు.ఎస్‌.ఎ., గ‌ల్ఫ్‌,మ‌లేషియా, సింగ‌పూర్‌, శ్రీలంక‌, యు.కె., యూర‌ప్‌, ఆఫ్రికా, అస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో విడుద‌ల‌వుతుంది.

02

అనుష్క, ఆర్య, ఊర్వశి, సోనాల్‌ చౌహాన్‌, ప్రకాష్‌ రాజ్‌, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, అడవిశేష్‌, పోసాని కృష్ణమురళి, భరత్‌, బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, డైలాగ్స్‌: కిరణ్‌ కుమార్‌, సాహిత్యం: అనంత్‌ శ్రీరామ్‌, శ్రీమణి, యం.యం.కీరవాణి, ఆర్ట్‌: ఆనంద్‌ సాయి,ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డ్యాన్స్‌: రాజుసుందరం, బృంద, ఫిరోజ్‌ఖాన్‌, కాస్ట్యూమ్స్‌: ప్రశాంత్‌, కథ, స్క్రీన్‌ప్లే: కణిక థిల్లాన్‌ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సందీప్‌ గుణ్ణం, నిర్మాత: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్ అన్నే, దర్శకత్వం: ప్రకాష్‌ కోవెలమూడి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *