సైకిల్, కాంగ్రెస్ లను తిడితే తీసేయాలా?

-అడివిదివిటలు సినిమా సెన్సార్ అభ్యంతరాలను తోసిపుచ్చా..
-పార్టీలను తిడితే సినిమా రిల్ కట్ చేయడం వద్దన్నా..
-పొలిటికల్ ఫ్యాక్టరీ వెబ్ చానల్ ప్రారంభోత్సవంలో మాజీ ఐజేయూ సెక్రటరీ జనరల్ కే. శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, ప్రతినిధి : ‘‘అప్పట్లో నేను సినిమా సెన్సర్ బోర్డు మెంబర్ గా ఉన్నా.. ఆర్.నారాయణ మూర్తి గారి అడవిదివిటలు సినిమాలు సెన్సార్ చేస్తున్నాం.. సినిమాలో భాగంగా కడుపుమండిన వ్యక్తి సైకిల్, కాంగ్రెస్ పార్టీలను తిట్టారు. వాటిని నా సహమెంబర్ వసంతలక్ష్మి వ్యతిరేకించారు. పార్టీల పేర్లు తొలగించాలని సూచించారు. కానీ నేను వద్దన్నా.. ఆ సినిమా చూశాక ఏడుపొచ్చింది. అంతా బాగా తీసిన సినిమా కు కత్తెరలొద్దని చెప్పా’’ అన్నారు
మాజీ ఐజేయూ సెక్రటరీ జనరల్ కే. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పొలిటికల్ ఫ్యాక్టరీ వెబ్ చానల్ ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన  కే.శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడారు. ఆర్.నారాయణ మూర్తి అడవిదివిటీలు సినిమా సెన్సార్ విషయంలో జరిగిన వ్యవహారాన్ని ఆయిన వివరించారు. ఆర్. నారాయణ మూర్తి తన సినిమా సెన్సార్ కట్ లు కావద్దని అంతకు ముందు రోజు తనను వచ్చి కలిశారని.. చూశాక చెబుతానని చెప్పానన్నారు. సినిమా చూశాక సెన్సార్ బోర్డు మెంబర్లందరూ కన్నీళ్లు పెట్టుకున్నారని.. సినిమా అంతా బాగా నారాయణ మూర్తి తీశారని కొనియాడారు.

చివరకు సినిమాలో సైకిల్ , కాంగ్రెస్ రెండు పదాలు తీసేసి విడుదలైందన్నారు.  సినిమా హిట్ సాధించిందన్నారు. పోలీసులు నక్సలైట్ అనుకూల సినిమాకు పర్మిషన్ ఇవ్వడంపై అభ్యంతరం తెలిపి తమను ప్రశ్నించారని శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు.

అనంతరం రాజ్యాధికారం హీరోయిన్ పద్మగంగావత్ పై పొగడ్తల వర్షం కురింపించారు. పద్మ తెలంగాణ యువతకు స్పూర్తిగా నిలుస్తోందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ  కళాకారుల కోసమే నూతన ఫిల్మ్ సిటీ నిర్మిస్తున్నారని.. వర్థమాన కళాకారులు అవకాశాలను ఉపయోగించుకోవాలన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.