సైంటిఫిక్ థ్రిల్లర్ గా మౌనం

లాస్‌ ఏంజిల్స్‌ టాకీస్‌, సంధ్యా సినీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మౌనం’. కిషన్‌ సాగర్‌.ఎస్‌ దర్శకత్వంలో మురళీకృష్ణ, భానుశ్రీ, ఐశ్వర్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్‌.ఎమ్‌. శ్రీలేఖ సంగీతాన్ని అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం టాకీపార్ట్‌ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు అల్లూరి సూర్యప్రసాద్‌, సంధ్యారవి లు మాట్లాడుతూ..” ఇదొక డిఫరెంట్‌ జోనర్‌లో సాగే సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ ఇది. ‘మౌనం’ సినిమాకి బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ చాలా ఇంపార్టెంట్‌. దీనికి శ్రీలేఖ గారైతే న్యాయం చేస్తారని భావించి..ఆమెను అప్రోచ్‌ అయ్యాము. ఆమె ఈ సబ్జెక్ట్‌ విని ఎంతో ఎంగ్జయిటీి ఫీలయ్యారు. అలాగే ‘శివ’ ఫేమ్‌ చిన్నా గారు ఓ అత్యద్భుతమైన పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. మా డైరెక్టర్‌గారు..గతంలో బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌గా నేషనల్‌ అవార్డ్సును పొందారు. ఆయన ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం టాకీ పూర్తయింది. త్వరలో కొలంబోలో పాటల చిత్రీకరణ జరుపనున్నాం..” అన్నారు.ఈ చిత్రానికి సంగీతం: ఎమ్‌.ఎమ్‌. శ్రీలేఖ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బలుసు రామారావు, కథ: అనిల్‌ కె. నాని, కథనం-మాటలు-కూర్పు: శివ శర్వాణి,
నిర్మాతలు: అల్లూరి సూర్యప్రసాద్‌, సంధ్యారవి,
దర్శకత్వం-డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: కిషన్‌సాగర్‌. ఎస్‌

మౌనం 2 మౌనం 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *