సేంద్రియ వ్యవసాయం ద్వారానే భూసారం పెరుగుతుంది: మంత్రి ఈటెల

సేంద్రియ వ్యవసాయం ద్వారానే భూసారం పెంపొందించి బలమైన పంటలు పండుతాయని రాష్ట్ర్ర ఆర్ధిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం కృషి భవన్ లో జరిగిన ప్రపంచ నేల దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హజరు అయినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత పద్దతులలోనే వ్యవసాయ సాగును ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర్ర ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత నిచ్చి ఆదుకుంటుందని అన్నారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని, భూమిలో గల లోపాలను గుర్తించి తగిన మందులు, ఎరువులు వాడితే అధిక పంట దిగుబడి సాధిస్తారని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని రైతుల పెంట బొందలే అన్ని రకాల ఎరువులని, మంత్రి అన్నారు. పెంట బొందలలోని ఎరువులను రైతులు పొలాల్లో వేసుకుంటే ఏరకమైన రసాయనక ఎరువులు అవసరం లేదని సూచించారు. వేసవిలో రైతులు తమ పొలాల్లో గొర్లు, పశువుల మందలను పెట్టించాలని తద్వారా భూసారం పెరుగుతుందని, వాన పాములు ఉత్పత్తి అవుతాయని అన్నారు.గ్రామాల్లోని కంచెలలో గల గానుగ పెంచలి ఆకు, పాల కొడిసె ఆకు, ఎంపం ఆకులను పొలంలో వేసుకుంటే బ్రహ్మండమైన పంటలు పండుతాయని సూచించారు. రైతులు తమ అనుభవం మేరకు శాస్త్ర్రవేత్తల సూచనలు, మట్టి పరీక్షలను బట్టి వ్యవసాయ సాగు చేసుకోవాలని అప్పుడే ఆరోగ్యకరమైన భూములలో పండిన పంటలతో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తారని తెలిపారు. కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులలో సాగు చేసుకోవాలని సూచించారు. రైతులు భూసార పరీక్షలు చేసుకోవాలని అన్నారు. పరీక్షల ఆధారంగా శాస్త్ర్రవేత్తలు రైతులకు ఏ పంటలు వేసుకోవాలని సూచనలు సలహలు ఇవ్వాలని అన్నారు. రైతులు కూరగాయలు సాగుతో అధిక లాభాలు సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తుల ఉమ, నగర మేయర్, రవీందర్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి తేజావలి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.