
సెల్ ఫోన్ జీవితంలో తెచ్చిన మార్పు అంతా ఇంతాకాదు.. అది లేనిదే ఇప్పుడు జీవితమే లేదు.. మనిషన్నవాడికి అదో నిత్యావసరంగా మారింది.. వారు వీరు అని కాకుండా అందరూ సెల్ ఫోన్ ను వాడుతున్నారు.. తిండిలేకున్నా బతుకవచ్చు కానీ .. సెల్ ఫోన్ లేకుండా బతకలేం అన్న భావన ఇమిడిపోయింది.
ఈ సెల్ ఫోన్లు ఎంతా విస్తరించాయనడానికి ఉదాహరణ ఈ చిత్రం. గోదావరఖని బస్టాండ్ అడుక్కుంటూ పొట్ట పోసుకునే వికలాంగుడైన ఒక భిక్షగాడు ఓ వైపు అడుక్కుంటూనే సెల్ ఫోన్ మాట్లాడుతున్న చిత్రం పీఎఫ్ కెమెరాకు చిక్కింది. వచ్చేది చిల్లర అయినా ఆ బిక్షగాడు తన సంపాదనతోనే సెల్ ఫోన్ కొనుక్కొని కమ్యూనికేషన్ భాగం కావడం నిజంగా అద్భుతంగా ఉంది.
దేశాన్ని పాలిస్తున్న పాలకులు.. తినడానికి తిండి పెట్టకున్నా.. ఇలా టెక్నాలజీని విస్తరించడంలో ముందున్నారనే దానికి ఈ చిత్రం సజీవ సాక్ష్యంగా మిగిలిపోతుంది..