Breaking News

సెలవులు రావడంతో పుష్కరాలకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జాం

HYDP29TRAFFIC_GED3A_767463e

నిన్న బంద్.. నేడు రంజాన్ సెలవు.. రేపు ఆదివారం మూడు రోజులు సెలవు దొరకడంతో జనం పుష్కర క్షేత్రాల బాట పట్టారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని పుష్కరఘాట్ లకు చేరుకునేందుకు బయలుదేరారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.. రాజీవ్ రహదారిపై మెదక్ జిల్లా తుఫ్రాన్, బెజ్జంకి మండలం గుండ్లపల్లి టోల్ గేట్ ల వద్ద దాదాపు 10కి.మీల మేర ట్రాఫిక్ జాం అయ్యింది.. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

కాళేశ్వరం వెళ్లే దారిలో దాదాపు 20 కి.మీల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. కమాన్ పూర్ నుంచి ట్రాఫిక్ జాం అయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ధర్మపురి వెళ్లే దారిలో పెద్దపల్లి నుంచే ట్రాఫిక్ జాం అవుతోంది. ధర్మపురికి ముందు 10.కి.మీల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక బాసర రెండు రోజుల వరకు ఖాళీ గా కనిపించగా సెలవుల ప్రభావంతో లక్ష మందికి పైగా జనం ఈరోజు తరలివచ్చారు. ఇక భద్రాచలం వద్ద అయితే 4 లక్షల మందికి పైగా జనం పుష్కరస్నానానికి తరలివచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *