సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓటమి

astraliaa

సిడ్నీ : ప్రపంచకప్ నుంచి ఇండియా నిష్ర్కమించింది. ఇవాళ జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ ఘోర వైఫల్యంతో ఇండియా ఘోర పరాజయం పాలయ్యింది. కోహ్లీ, రైనా, రోహిత్  ఇలా టాప్, మిడిలార్డర్ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా అన్నిరంగాల్లో రాణించి టీమిండియాపై గెలిచి ఫైనల్ కు వెళ్లింది. ఈ నెల 29న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ తో తలపడబోతోంది.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ సెంచరీ 105, ఫించ్ 81 పరుగుల సాయంతో ఆస్ట్రేియా 7 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియాకు భారత ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. శిఖర్ దావన్ 45, రోహిత్ 34 పరుగులు చేశారు.  కెప్టెన్ ధోని 65, రహానే 44 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బ్యాటింగ్ వైఫల్యంతో పాటు ఆస్ట్రేలియా బలమైన బౌలింగ్ కు ఇండియా టపటప వికెట్లు కోల్పోయి 46.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *