Breaking News

సెమీస్ పోరులో భారత్ నిలిచేనా.?

Match09

ఇవాళ టీ ట్వంటీ ప్రపంచకప్ లో కీలక ఫైట్ కు రంగం సిద్ధం అయ్యింది. ఈరోజు రాత్రి 7.30కు జరిగే భారత్-వెస్టిండీస్ సెమీస్ పోరుపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుంది. గ్రూప్ దశలో సెమీస్ చేరడానికి ఆపసోపాలు పడ్డ టీమిండియా సెమీస్ లో ఎలా ఆడుతుందనే ఉత్కంఠ నెలకొంది.. మరో వైపు వెస్టిండీస్ దిగ్గజ జట్లు అయిన దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక లాంటి బలమైన జట్లను ఓడించి సెమీస్ చేరింది..

కాగా టీమిండియా పాం లేమి భారత్ ను కలవర పరుస్తోంది. విరాట్ కోహ్లీ మినహా మిగతా వారందరూ విఫలమవుతూనే ఉన్నారు. కోహ్లీ ఆడకపోతే ఆస్ట్రేలియాపై ఓడిపోయేవాళ్లమే.. ఇప్పటివరకు కోహ్లీ ఒక్కడే 181 పరుగులు చేసి టాప్ స్కోరర్.. ఇప్పుడు మిగతా ఓపెనర్లు, ఆడాల్సిన అవసరం ఉంది.. లేకపోతే భారత్ పరిస్థితి దారుణమే.. యువరాజ్ గాయపడడంతో మనీష్ పాండేను పిలిపించారు. మనీష్ లేదా రహానేలలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కొచ్చు..కాగా టిమిండియా ఈ మ్యాచ్ లో గెలవాలని అందరూ ఎదురుచూస్తున్నారు. సో మీరు రెడీ అవ్వండి టిమిండియా గెలవడానికి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *