
గ్రూప్ మ్యాచ్ ల్లో దుమ్ము రేపిన శ్రీలంక క్వార్టర్ ఫైనల్ నౌకట్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో ఘోర వైఫల్యంతో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. దక్షిణాఫ్రికా బౌలింగ్ ధాటికి కుదేలయ్యింది. ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ లో బుధవారం దక్షిణాఫ్రికా-శ్రీలంకలు తలపడ్డాయి. గ్రూప్ మ్యాచ్ లలో వరుసగా నాలుగు సెంచరీలు చేసి జోరుమీదున్న శ్రీలంక వెటరన్ ఆటగాడు సంగక్కర ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బౌలింగ్ దాడికి పరుగులు చేయలేక ఔటయి పోయాడు.
దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి శ్రీలంక 133 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సంగక్కర 96 బంతుల్లో 45 పరుగులు చేశారు. శ్రీలంక ఇన్నింగ్స్ లో అతడే టాప్ స్కోరర్. 37.2 ఓవర్లలో 133 పరుగులకు లంక చూపెట్టింది.
అనంతరం బ్యాంటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో 134 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. డీ కాక్ 57 బంతుల్లో 78 పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు సునాయస విజయాన్ని అందించాడు.
కాగా క్వార్టర్ ఫైనల్స్ లో శ్రీలంకను చిత్తు చేసి తొలిసారి నౌకట్ దశను దక్షిణాఫ్రికా అదిగమించింది. ఇంతకు ముందన్నడూ నాకౌట్ మ్యాచ్ లల్లో సఫారీలు గెలిచిన చరిత్ర లేదు. కానీ ఈ రోజు మ్యాచ్ లో లంకను దారుణంగా ఓడించి మిగతా ప్రత్యర్థులు సౌతాఫ్రికా సవాలు విసిరి సెమీస్ చేరిన తొలి జట్టుగా గుర్తింపు పొందింది.