సెన్సార్ పూర్తి చేసుకున్న ‘తరువాత కధ’

సోనియా అగర్వాల్, అర్చన, వినోద్ కుమార్, రవిప్రకాష్, శివాజీరాజా ప్రధాన పాత్రదారులుగా శ్రీ పద్మావతి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రభాకరన్ దర్శకత్వంలో ఆర్.పద్మజ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘తరువాత కధ’.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఆర్.పద్మజ మాట్లాడుతూ ‘‘ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్పార్ సభ్యులందరూ మంచి సినిమా తీశారని టీమ్ ని అభినందించారు.తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాలవారికీ నచ్చుతుంది. ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతోంది, ఇప్పటివరకు మేము అనుకున్న సమయంలోనే మా చిత్రాన్ని పూర్తిచేస్తున్నాం. ఇది సస్పెన్స్ ధ్రిల్లర్ చిత్రం సోనియా అగర్వాల్, రవిప్రకాష్ లపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అదేవిధంగా అర్చన, వినోద్ కుమార్, శివాజీరాజా పాత్రలు ఆలోచించేలా చేస్తాయి. ప్రతి సన్నివేశం కొత్తగా అందరికీ నచ్చేవిధంగా ఉంటాయి. మా దర్శకుడు మాకు కధ చెప్పిన దానికంటే చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. తప్పకుండా మా చిత్రం దర్శకుడికి మంచి పేరు తీసుకొస్తుంది, నిర్మాతగా నాకు మంచి గుర్తింపు ఇస్తుందని గట్టినమ్మకం నాకుంది’’అని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు ప్రభాకరన్ మాట్లాడుతూ ‘‘కొత్తదనాన్ని కోరుకునే మన తెలుగు ప్రేక్షకులకు మా చిత్రం చాలా బాగా అలరిస్తుంది నిర్మాత నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా నా బాధ్యతను సద్వినియోగం చేసుకున్నాను’’నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత ఆర్.పద్మజ గారికి మరియు సమర్పకులు ఉదయభాస్కర్ జాస్తి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రంలో సోనియా అగర్వాల్, అర్చన, వినోద్ కుమార్, రవిప్రకాష్, శివాజీరాజా, సత్యకృష్ణన్, జైసింహ, హరిత, రాహుల్, వెంకట్, భగవాన్, సందీప్తి, విష్ణుప్రియ, ప్రియాంక, లత, ఉమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పార్వతి చంద్, ఎడిటింగ్: రమేష్, సంగీతం: తారకరామారావు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఉదయభాస్కర్ జాస్తి, నిర్మాథ: ఆర్.పద్మజ, స్క్ర్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రభాకరన్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *