సెకండ్ ఎఎన్ఎంల మొద‌టి మ‌హాస‌భ‌లో వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి

సెకండ్ ఎఎన్ఎంల మొద‌టి మ‌హాస‌భ‌లో వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి

త్వ‌ర‌లోనే రెండో ఎఎన్ఎంల స‌మ‌స్య‌ల‌ ప‌రిష్క‌రిస్తాం

అధ్య‌య‌నం చేశాక సీఎం దృష్టికి ఫైల్‌

హైద‌రాబాద్:  త్వ‌రలోనే రెండో ఎఎన్ఎంల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని, ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్టర్ సి ల‌క్ష్మారెడ్డి అన్నారు. సెకండ్ ఎఎన్ఎంల స‌మ‌స్య‌ల మీద ఇప్ప‌టికే అధ్య‌య‌నం చేస్తున్నామ‌ని, అలాగే వారి స‌మ‌స్య‌ల‌న్నీ సీఎం దృష్టిలో ఉన్నాయ‌ని, ఒక నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని మంత్రి అన్నారు. సెకండ్ ఎఎన్ఎంల మొద‌టి మ‌హాస‌భ టిఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వ‌ర్యంలో ఆర్టీసి క‌ళ్యాణ మండ‌పంలో సోమ‌వారం జరిగింది. హోం, కార్మిక‌శాఖ‌ మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే శ్రీ‌నివాస గౌడ్, సంఘం నేత‌లు, రాష్ట్ర వ్యాప్తంగా త‌ర‌లి వ‌చ్చిన రెండో ఎఎన్ఎంల‌తో మ‌హా స‌భ జ‌రిగింది.

ఈ సంద‌ర్బంగా మంత్రి ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో అనేక స‌మ‌స్య‌లు పేరుకుపో్యాయ‌న్నారు. అందులో రెండో ఎఎన్ఎం నియామ‌కాలే ఓ విచిత్రంగా జ‌రిగాయ‌న్నారు. అప్ప‌ట్లో ఉద్యోగం కోసం చేరిన వారంద‌రికీ ఓ ప‌ద్ధ‌తి లేకుండా వ్య‌వ‌ర‌హ‌రించార‌న్నారు. అయితే, తెలంగాణ రాష్ట్ర సీఎంగా కెసిఆర్ ఒక్కో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటూ బంగారు తెలంగాణ బాట‌లో ప‌య‌నిస్తున్నార‌న్నారు. ఇప్ప‌టికే వైద్య ఆరోగ్య‌శాఖ‌లో అనేక సంస్క‌ర‌ణ‌లు తెచ్చామ‌న్నారు. ఒక్క రోజులోనే స‌మ‌స్య‌ల‌న్నీ తీర‌వ‌న్నారు. కొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. రెండో ఎఎన్ఎంల స‌మ‌స్య‌లు సీఎం దృష్టిలో ఉన్నాయ‌న్నారు. వాటిని ప‌రిష్క‌రించ‌డానికి త‌మ‌ను సీఎం ఆదేశించార‌ని, ఆయా స‌మ‌స్య‌ల‌ను అధ్య‌య‌నం చేస్తున్నామ‌ని, ఒక నివేదిక త‌యారు చేసి సీఎం దృష్టికి తీసుకెళతామ‌న్నారు. అప్ప‌టి వ‌ర‌కు రెండో ఎఎన్ఎంలు ఓపిగ్గా ఉండాల‌ని సూచించారు. రెండో ఎఎన్ఎంల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించాల‌ని ఆయా స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని రెండో ఎఎన్ఎంల హ‌ర్ష ధ్వానాల మ‌ధ్య మంత్రి ప్ర‌క‌టించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *