సృజనకు చైతన్యానికి అడ్డ – కరీంనగర్ గడ్డ

-కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచస్థాయికి చేరిన వేళ.. ఉద్దీపన భావ వ్యాప్తిలో సృజన (ఆర్ట్ , చిత్రకళ) చైతన్యానికి వేదికగా కరీంనగర్ జిల్లా నిలవడం గర్వ కారణమని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. స్థానిక శ్రీనివాస హోటల్ లో స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో ఏప్రిల్ 18,19 తేదీలలో చిత్రకళా ప్రదర్శనను ప్రారంభించిన ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడారు.

02

తెలంగాణ ప్రజల సంస్కృతి , చరిత్రను చిత్రకళా ద్వారా ప్రపంచానికి చాటిన గొప్ప చిత్రకారులున్న గడ్డ మన తెలంగాణ అని, ప్రపంచస్థాయి ప్రసిద్ధి చెందిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, న్యాయమూర్తులు, జస్టిస్ జీవన్ రెడ్డి, డా.సి.నా.రే మొదలు గాగల మేధావులు పుట్టిన గడ్డ కరీంనగర్ జిల్లా అని మేనెలలో కరీంనగర్ లో 10 జిల్లాలతో కూడుకున్న రాష్ట్ర స్థాయి సెమినార్, ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసి జాతీయ స్థాయి చిత్ర కళాకారుల సమ్మేళనం ఏర్పాటుకు ప్రయత్నిస్తామని ఎంపీ అన్నారు.

ఈ కార్యక్రమానికి స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కొండూరు జగన్మోహన్ రావు అధ్యక్షత వహించగా అతిథులుగా కరీంనగర్ డైరీ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర రావు, తెలంగాణ రాష్ట్ర ఎకనామిక్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనుకయ్య, ముదుగంటి సుధాకర్ రెడ్డి, డా. సముద్రాల జనార్ధన్ రావు, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ డా. బిందు, సుధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *