సూపర్ ఓవర్ లో రాజస్తాన్ పై పంజాబే విన్

ఐపీఎల్ రసవత్తర పోరు నడిచింది. రాజస్తాన్, పంజాబ్ లో హోరాహోరీగా తలపడ్డాయి.  చివరకు స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ కు దారితీసింది. చివరకు సూపర్ ఓవర్ లో విజయం పంజాబ్ ను వరించింది.

మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్  20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది.  రహానే 74, వాట్సాన్  45 పరుగులు చేశారు. అనంతరం బ్యాంటింగ్ ప్రారంభించిన పంజాబ్ సరిగ్గా  20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులే చేయగలిగింది. షాన్ మార్స్  65, మిల్లర్  54 పరుగులు చేశారు.

మ్యాచ్ టై అయి పోవడం సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్ లో మొదట పంజాబ్  6 బంతుల్లో 15 పరుగులు చేయగా రాజస్తాన్ 6 పరుగులే చేసి ఓడిపోయింది.  మార్ష్ అద్భుతంగా ఆడి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *