సూపర్‌స్టార్‌ మహేష్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ల కొత్త చిత్రం ‘జనగణమన’

సూపర్‌స్టార్‌ మహేష్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో 2006 ఏప్రిల్‌ 28న విడుదలైన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ‘పోకిరి’. ఈ చిత్రం విడుదలై ఈరోజుకి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి 40 కోట్లు మార్క్‌ దాటిన తొలి సినిమా ‘పోకిరి’. సూపర్‌స్టార్‌ మహేష్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం పదేళ్ళు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బిజినెస్‌మేన్‌’ చిత్రం కూడా సూపర్‌హిట్‌ అయింది. ‘పోకిరి’ పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న కొత్త సినిమా ‘జనగణమన’ టైటిల్‌ని పూరి జగన్నాథ్‌ ఎనౌన్స్‌ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

About The Author

Related posts