సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల పునరుద్దరణకు ముందుకు రావాలని బ్యాంకులను కోరిన మంత్రి కెటి రామారావు

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) తో మంత్రి కెటి రామారావు ఈరోజు సమావేశం

సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు బ్యాంకుల నుంచి అందించాల్సిన సహాయం పైన చర్చ

సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల సమస్యల పరిష్కారానికి లీడ్ భ్యాంకు అధ్యర్యంలో ప్రతి నెల జిల్లా కేంద్రాల్లో టౌన్ హాల్ సమావేశాలు

ఏమ్ యస్ ఏఈ పరిశ్రమల పునరుద్దరణకు, రుణాల వసూలుకు రెక్టీఫీకేషణ్, రిస్ర్టక్చరింగ్, రికవరీ అనే త్రీ అర్ (3R) సూత్రాన్ని పాటించాలన్న మంత్రి

సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు తెలంగాణ
ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నామన్న మంత్రి

ఇందులో భాగంగా ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు

ఇండస్ట్రీ హెల్త్ క్లినిక్ కంపెనీలో బ్యాంకర్లు పెట్టుబడులు పెట్టి భాగస్వాములు కావాలని కోరిన మంత్రి

రాష్ర్టంలోని నేతన్నలకు ముద్రాలోన్లలో అవకాశం కల్పించి రుణాలివ్వాలి

లోన్ల కేటాయింపులో మహిళా పెట్టుబడిదారులకు మరింత ప్రాధాన్యత
ఇవ్వాలన్న మంత్రి

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) తో మంత్రి కెటి రామారావు ఈరోజు సమావేశం అయ్యారు. సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు బ్యాంకుల నుంచి అందించాల్సిన సహాయం పైన చర్చించారు. హైదారాబాద్, కోటిలోని SBI ప్రధాన కార్యాలయంలో వివిధ బ్యాంకర్లు, సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గోన్నారు. సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమల సమస్యల పరిష్కారానికి లీడ్ భ్యాంకు అధ్యర్యంలో ప్రతి నెల జిల్లా కేంద్రాల్లో టౌన్ హాల్ సమావేశాలు ఎర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశాల ద్వారా పరిశ్రమల సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వ పరమైన మరియు బ్యాంకుల పరమైన విషయాల్లో సహాకారం అందిస్తామన్నారు. జిల్లా పారిశ్రామిక కేంద్రాలు(డియిసీ)లతో సమన్వయం చేసుకుని సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల పునరుద్దరణకు ముందుకు రావాలన్నారు. ఏమ్ యస్ ఏఈ పరిశ్రమల పునరుద్దరణకు రెక్టీఫీకేషణ్, రిస్ర్టక్చరింగ్, రికవరీ అనే త్రీ అర్ ( three “R” ) సూత్రాన్ని పాటించాలన్నారు.

ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్దరణలో యూనిట్ల సమస్యను గుర్తించి, వాటికి పరిష్కారం చూపించి, రుణాలను పునరుద్దరించి, తమ రుణాలను రికవరీ చేసుకోవాలని బ్యాంకర్లకు కోరారు. సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతుందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ల్ను ఏర్పాటు చేయడం ద్వారా చిన్నతరహా పరిశ్రమల సమస్యలను అర్థం చేసుకొని వాటికి సంబంధించిన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు ముందుకుపోతున్నామని తెలిపారు. ఈ హెల్త్ క్లినిక్ కు అర్భీఐ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీగా గుర్తింపు ఇచ్చిందన్నారు. ఇలా సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఒక సంస్ధను ఎర్పాటు చేసిన తొలి రాష్ర్టమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండస్ట్రీ హెల్త్ క్లినిక్ కంపెనీలో బ్యాంకర్లు పెట్టుబడులు పెట్టి భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.

సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమల అభివృద్దిలో బ్యాంకుల సహకారాన్ని తాము గుర్తిస్తున్నామన్న మంత్రి, సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో లోన్లు ఇచ్చేలా, వాయిదాలను చెల్లించకుంటే వాటిని మెండి బకాయిల ఖాతాలోకి పంపకుండా, వాటిని తిరిగి అదుకునే విషయంలో నిర్వహించే  Techno Economic Viability (TEV) అద్యయనంలో కొంత సానుకూలంగా ఉండాలన్నారు. సాద్యమైనంత తక్కువ సమయంలో దీన్ని పూర్తి చేయాన్నారు. అవసరం అయితే ఈ అద్యయయనాన్ని తమ హెల్త్ క్లినిక్ చేసి పెడుతుందన్నారు. చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమల పురురద్దరణకు కోసం తీసుకోవలసిన చర్యలు, సూక్ష్మ పరిశ్రమలకు ముద్ర లోన్ల పంపిణీ, ఖాయిలా పడిన సూక్ష్మ చిన్న తరహా యూనిట్లకు అందించాల్సిన సహాకారం పైన ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

తక్కువ మెత్తాల్లో రుణాలను పునరుద్దరించడం ద్వారా అనేక చిన్న తరహా పరిశ్రమలు తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయని, ఇలాంటి వాటికి ఖచ్చింతగా సహాకారం అందించాలని మంత్రి బ్యాంకర్లను కోరారు. పుడ్ ప్రాసెసింగ్, లెదర్, వివిద వృత్తుల అధారిత పరిశ్రామిక క్లస్టర్లలో ఉన్న యూనిట్లకు లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలన్నారు. మహిళా పెట్టుబడిదారులకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముద్రాలోన్లు, ప్రధాన మంత్రి ఉపాధి పథకం వంటి కార్యక్రమాల్లో రుణాల పంపణీ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని మంత్రి బ్యాంకర్లను కోరారు. ఈ రెండు అంశాల్లో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. రాష్ర్టంలోని నేతన్నలకు ముద్రాలోన్లలో అవకాశం కల్పించి రుణాలివ్వలన్నారు.

ఈ సమావేశంలో పలు బ్యాంకుల ఉన్నతాధికారులు, తెలంగాణ పరిశ్రమ శాఖాధికారులు, పరశ్రమ సంఘాలు, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమ ప్రతినిధులు పాల్గోన్నారు.

ktr 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *