
వరంగల్ జిల్లా నుంచి టీడీపీ తరఫున ఎంపీగా ఉన్న గుండు సుధారాణి ఢిల్లీలో సీఎం కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ పథకాలు పాలనపై ప్రశంసలు కురిపించారు. ఈమె టీఆర్ఎస్ ఇక చేరడమే ఆలస్యం.. కాగా సుధారాణి రాకతో టీఆర్ఎస్ లో కొనసాగుతున్న కొండా సురేఖకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది.
మహిళా కోటాలో ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చే చాన్స్ మున్ముందు ఉంది. సుధారాణి చేరికతో ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తే ఆ పదవి సుధారాణికే పోతుందని కొండా దంపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.. కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొండా సురేఖ ను వదిలించుకునేందుకే కేసీఆర్ ఇలా చేస్తున్నారనే విమర్శలున్నాయి..