సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో ‘గల్ఫ్’

‘సొంత ఊరు’, ‘గంగపుత్రులు’,ఒక రొమాంటిక్ క్త్ర్రెమ్ కధ’తదితర చిత్రాల్లో సమకాలీన సమస్యలను చర్చించిన దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి. మరో విభిన్న
చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. గల్ఫ్ నేపధ్యంలో ‘గల్ప్’పేరుతో శ్రావ్య ఫిలింస్ పతాకంపై ఈ సినిమా చేయబోతున్నారు. ఆ విశేషాలను ఆయన ఇలా చెప్పారు.
‘‘గల్ఫ్…ఎడారిలో మండుటెండల్లో జీవితాల్ని వెతుక్కోవడానికి వెళ్ళి అక్కడ విజయాల్ని, సౌకర్యాల్ని అందుకున్న వారు కొందరైతే, ఆ ఎడారి మంటల్లో తడారిన జీవితాలు
కొన్ని. రెండు తెలుగు రాష్ట్ర్రాల నలుమూలల నుండి పొట్ట చేత పట్టుకొని గుండె చిక్కబట్టుకొని భాష తెలియని ప్రాంతాలకి వలస వెళ్ళి తమ కుటుంబాల కోసం రేయింబవళ్ళు
కష్టాలు పడి ఆ మట్టి గడ్డల్ని భూతల స్వర్గాలుగా మారుస్తున్నారు. పుట్టిన దేశానికి వేల కోట్ల విదేశీ కరెన్సీ పంపి దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా
విదేశాల నుండి ఎక్కువ డబ్బులు పంపేది భారతీయులే. అయినా సరైన గుర్తింపు లేక దేశం కాని దేశంలో సమస్యలు వచ్చినప్పుడు ఆదుకొనే దిక్కులేక నలిగిపోతున్న వారు
ఎందరో ఉన్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి, పరాయి దేశంలో చిక్కుకొని ప్రతిక్షణం బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్ళదీస్తూ, ప్రభుత్వ ఆదరణకు నోచుకోక, ఏమి చెయ్యాలో
అర్ధం కాక అవస్ధలు పడుతున్న ఎందరో తెలుగు వారి కధలు మనకు న్యూస్ పేపర్లలో పలకరిస్తూ ఉంటాయి. అరబ్బు షేకుల కాంట్రాక్టు పెళ్ళిళ్ళకు బలైపోయిన చెల్లెళ్ల కధళు
చానల్స్ లో కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి కధల్ని, వ్యధల్ని, కన్నీళ్లని, వారి పోరాటాన్ని, బతుకు చిత్రాన్ని, వారు అందుకున్న విజయాల్ని, అక్కడ ఆనందాల్ని, కేరింతలకి
దృశ్య రూపం ఇవ్వాలన్న ప్రయత్నమే ఈ ‘గల్ఫ్’చిత్రం. ఈ కధ నాలుగు గోడల మధ్య రాసేది కాదు. ఈ కధ మీ అనుభవాల నుండి పురుడు పోసుకోవాలనేదే మా ఆలోచన.
గల్ఫ్ జీవితం గురించిన మీ అనుభవాలు, మీకు తెలిసిన విజయాలు పంచుకోవలసిన చిరునామ. e-mail:gulfthemovie@gmail.com
సమాజమే కధావస్తుగా మేం చేస్తున్న ఈ ప్నయత్నానికి మంచి ఆదరణ లభిస్తుందని నమ్మకం.’’
-సునీల్ కుమార్ రెడ్డి

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *