
మాజీ మంత్రి, కిరణ్ హయాంలో మంత్రిగా చేసిన సునీత లక్ష్మారెడ్డి కారెక్కబోతున్నట్టు సమాచారం. మెదక్ జిల్లాకు చెందిన ఈమె ప్రస్తుత ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో వచ్చే సరికి కూడా కష్టమేనన్న ఊహాగానాలు నేపథ్యంలో మంత్రి హరీష్ రావుతో భేటి అయినట్టు సమాచారం. నిన్నటినిన్న ఎంపీ గుత్తా సహా కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ నేతలు కారెక్కడంతో బీత్తరపోయిన కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు సునీత లక్ష్మారెడ్డి. వైఎస్, రోశయ్య, కిరణ్ కేబినెట్ లో కీలకపాత్ర పోషించారు. అనంతరం 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు.
వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేకపోవడంతో అన్నేళ్లు అధికారంలోకి దూరంగా ఉండడం ఇష్టం లేక కారెక్కబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆమె నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలతో సమాలోచనలు జరిపి , సీఎం కేసీఆర్ ను రహస్యంగా కలిసినట్టు సమాచారం. దీంతో త్వరలోనే కాంగ్రెస్ నుంచి మరో వికెట్ పడబోతోందన్నమాట..