
సునందా పుష్కర్ ది ఆత్మహత్య కాదు హత్యే అని తేల్చారు ఢిల్లీ పోలీసులు. గత ఏడాది సంచలనం కలిగించిన నేరాల్లో సునంద అనుమానాస్పద మరణం ఒకటి. విష ప్రయోగం ద్వారా ఆమెను హత్య చేశారని నిర్ధారణ అయింది. మరి ఆ హత్య ఎవరు చేశారనేది ఇప్పుడు తేలాలి. దంపతుల మధ్య గొడవలతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ఇంత కాలం చాలా మంది భావించారు. అది తప్పని రుజువైంది.
హోటల్ గదిలో శవమై కనిపించిన సునందను చంపింది ఎవరు? భర్దతో ఆమె కాపురం సజావుగా లేదనడానికి అనేక ఆధారాలున్నాయి. పాకిస్తాన్ జర్నలిస్టు మెహర్ తరార్ తో భర్త శశి థరూర్ సాన్నిహిత్యం సునందకు ఆందోళన కలిగించింది. తన కాపురంలో నిప్పుడు కురుస్తాయని భయపడింది. మెహర్ ఐఎస్ఐ ఏజెంట్ అని, తన భర్తను వలలో వేసుకుందని సునంద ట్వీట్ చేసి సంచలనం రేపింది.
అందాల జర్నలిస్టు మోజులో తన భర్త పడి ఉంటాడనే అనుమానం, అభద్రతాభావం, భర్తతో గొడవ తర్వాత ఆమె మరణించింది. శశి ధరూర్ ను విచారించాలని సుబ్రమణ్య స్వామి మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నారు. శశి థరూర్ పైనా తమకు అనుమానాలున్నాయని సునంద కజిన్, మరి కొందరు మొదటి నుంచీ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు శశి థరూర్ తన నిర్వోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
కేసు దర్యాప్తులో ఆదారాల ప్రాతిపదికన పోలీసులు స్పందిస్తారు. కానీ ఇది హత్య అని పోలీసులు ప్రకటించగానే అలా ఎలా చెప్తారని థరూర్ ప్రశ్నించారు. సునంద మృతిపై తనకు అనుమానాలు లేవన్నారు. అనుమానాలు ఉంకూడదనికి చట్టానికి. మొత్తానికి థరూర్ మాటలు, ఆయన టెన్షన్ లో ఉన్నారని సూచిస్తున్నాయి. ఆ టెన్షన్ కు కారణం ఏమిటో కూడా తేలాల్సి ఉంది.