సుఖమయమైన వృధ్ధాప్యం కోసం..

1. మీ సొంతఊరిలో, సొంత గడ్డ మీద నివసించండి… స్వతంత్రంగా జీవించడంలో కల ఆనందాన్ని పొందండి..

2. మీ బ్యాంకు బేలెన్స్ మరియు స్థిరాస్థులు మీ పేరు మీదనే ఉంచుకోండి.. అతి ప్రేమకు పోయి ఇతరుల పేరు మీద పెట్టాలనే ఆలోచన రానివ్వకండి.

3. పెద్దవయసులో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని మీ పిల్లలు చేసిన ప్రమాణాల మీద ఎక్కువ ఆశపడకండి.. ఎందుకంటే కాలం గడిచేకొద్దీ వారి ప్రాధాన్యతలు మారవచ్చు… ఒక్కోసారి వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకున్నా కూడా, చూడలేని పరిస్థితులు ఎదురవ్వవచ్చు.

4. మీ శ్రేయస్సు కోరే వారిని మీ స్నేహితులుగా ఉంచుకోండి…

5. ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోకండి, ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆశ పెట్టుకోకండి..

6. మీ సంతానం యొక్క జీవితాలలో జోక్యం కలుగచేసుకోకండి.. వారిని వారి పధ్ధతులలో జీవించనివ్వండి.. మీరు మీ తరహాలో జీవించండి.

7. మీ వృధ్ధాప్యం వంకతో ఎవరి చేతనైనా సేవ చేయించుకోవాలి అనో , లేదా, నా వయసు కారణం గా ఎదుటివారు నాకు గౌరవం ఇవ్వాలి అనో ఆశించకండి…

8. అందరి సలహాలూ వినండి.. కానీ మీ స్వంత ఆలోచన ప్రకారం, మీకు ఏది వీలుగా ఉంటుందో అది ఆచరించండి.

9. ప్రార్ధించండి కాని, అది భిక్షమెత్తుకుంటున్నట్టు ఉండకూడదు…. చివరికి భగవంతుని కూడా ఏమీ కోరుకోవద్దు.. దేవుణ్ణి ఏదైనా కోరుకున్నాము అంటే అది కేవలం మనం చేసిన పొరపాట్లకు క్షమాపణ, లేదా జీవించడానికి అవసరమైన ధైర్యం మాత్రమే కోరుకోండి.

10. ఆరోగ్యం మీద శ్రధ్ధ వహించండి. మీ ఆర్థిక పరిస్థితిననుసరించి, చక్కని పౌష్టికాహారం తీసుకోండి.. శరీరం సహకరించినంత వరకు మీ పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న సమస్యల మీద దృష్టి పెట్టకండి..పెద్ద వయసు వచ్చాక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సహజమే…

11. ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి… మీరు సంతోషంగా ఉంటూ, ఇతరులకు ఆనందాన్ని పంచడానికి ప్రయత్నించండి.

12. ప్రతి సంవత్సరం మీ జీవిత భాగస్వామితో కలిసి చిన్న టూరు కు వెళ్ళిరండి.. దీనివలన జీవితం పట్ల మీ దృష్టికోణం మారుతుంది.

13. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవటం నేర్చుకోంది… ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి.

14. జీవితంలో శాశ్వతమైనదేదీ లేదు.. అలాగే దు:ఖాలు కూడా శాశ్వతం కాదు.. ఈ మాటను విశ్వసించండి..

15. రిటైర్మెంట్ సమయానికి మీ బాధ్యతలన్నిటినీ తీర్చేసుకోండి. మీకోసం మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడే అది అసలైన స్వేచ్చతో జీవించడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి..

అందరికీ సుఖమయ జీవన శుభాకాంక్షలు…

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *