సుందరంగా రాజన్న చెరువు: హరీష్ రావు

కరీంనగర్: 62 కోట్ల రూపాయలతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడి చెరువును సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర్ర నీటి పారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి టి.హరీష్ రావు అన్నారు. గురువారం వేములవాడ గుడి చెరువు 62 కోట్లతో చేపట్టే పనులను ఆయన ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్ర్రంలో దక్షిణ కాశీగా పేరు గాంచిన రాజరాజేశ్వరి స్వామి దేవాలయం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వేములవాడ పర్యటన సందర్భంలో ఆలయ అభివృద్ధితో పాటు గ్రామాభివృద్ధి, చెరువుల అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హమీ మేరకు మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా గుడి చెరువు పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. రింగ్ బండ్ లను 150 ఫీట్లకు పెంచడం, 30 ఎకరాల భూమి సేకరించడం, ఇందులో నుండి భూ సేకరణకు 22 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. శిఖం భూములు స్వాధీనం చేసుకొంటామన్నారు. దేవాలయ అభివృద్ధికి కలిసికట్టుగా రావాలని, వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు 17 వేల చెరువుల్లో అభివృద్ధి, మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందన్నారు. గుడి చెరువులో నిరంతరం స్వచ్చమైన గోదావరి జలాలు ఉండేందుకు ఎల్లంపల్లి కాలువ ప్యాకేజి -9 ద్వారా కెనాల్ గుండా తీసుకురావడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ పనులను కేంద్ర పాలకులు, వివిధ రాష్ట్ర్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర నాయకులు కొనియాడుతున్నారని అన్నారు. ఇంటింటికి నల్లానీరు, కళ్యాణలక్ష్మీ, షాది ముబారఖ్, ఫించన్లు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహల్లోని విద్యార్ధులకు పాత సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం 250 ఇంగ్లీషు మీడియంతో రెసిడెన్సియల్ పాఠశాలలు మంజూరు చేశామన్నారు. 30 మహిళా రెసిడెన్సియల్ డిగ్రీ కళాశాలలు ఈ సంవత్సరం నుండే ప్రారంభించామన్నారు. కార్పోరేట్ తరహలో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దడం, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. కోటి ఎకరాలకు నీరందించడం రాష్ట్ర్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. కరీంనగర్ జిల్లాకు సమీపాన గల ఎల్.ఎం.డి., ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి రిజర్వాయర్ల ద్వారా మరో కోనసీమగా వెలసిల్ల బోతుందని ఆయన అన్నారు. సాగు నీటి వలన రైతుల, మత్స్యకారులు, గీత కార్మికుల వంటి వారికి ఉపాధి జరుగుతుందన్నారు. త్వరలో కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్ లు ఏర్పడతాయని అన్నారు. కరీంనగర్ జిల్లా మరుగుదొడ్ల నిర్మాణంలో రాష్ట్ర్రంలో ప్రధమ స్ధానంలో ఉందని, అలాగే ఇంకుడు గుంతలు, హరితహరం కార్యక్రమంలో కూడా ప్రగతి సాధించాలన్నారు. వేములవాడ శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ బాబు స్వాగతోపన్యాసంతో మాట్లాడుతూ 1117 కోట్లతో నియోజక వర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రాజరాజేశ్వర స్వామి దేవాలయం, నాంపల్లి గుట్ట, గ్రామాభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఎల్లంపల్లి గోదావరి నీటిని కాలువల ద్వారా గుడి చెరువులోకి నిత్యం నీటి సరఫరా ఉంచాలని మంత్రిని కోరారు. నిత్య పుష్కరాలతో భక్తులు ఎక్కువ సంఖ్యలో దైవ దర్శనాలు చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాట్లాడుతూ, మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా గుడి చెరువు పనులు చేపడుతున్నామని, ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధి జరుగుతుందన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ, భక్తుల సౌకర్యాలు, దర్శనాల కోసం చెరువు పనులు చేపడుతున్నట్లు, మినీ ట్యాంక్ బండ్ పనులు చేపడుతున్నామన్నారు. పారదర్శకంగా పాలన అందించి అభివృద్ధి పనులు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుల ఉమ, ఎం.పి.పి. వెంకటేష్, వాడా వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, ఇతర స్ధానిక ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ సిఇ నాగేందర్, ఎస్ఇ వెంకటకృష్ణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

HARISH RAO     HARISH RAO.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *