సీమాంధ్ర మీడియా వార్తలపై స్పందించిన గవర్నర్

తెలంగాణ పక్షపాతి అంటూ ఆంధ్రా మీడియా చేస్తున్న దుష్ప్రాచారంపై గవర్నర్ స్పందించారు. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలపై పన్ను, ఏపీలో కరువు పరిస్థితులపై స్పందించాలని సోమవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాలపై మాట్లాడరని సమాచారం. ప్రజా సమస్యలపై నీతిగా., నిజాయితీగా.. ఏం చేయాలో తనకు తెలుసనని.. గవర్నర్ అన్నారు. రాజ్ భవన్ లో తాను ఖాళీగా టైంపాస్ చేస్తూ కూర్చోలేదని గవర్నర్ చెప్పారట..

మొదట్నుంచీ తాను ఏం చేస్తున్నది ప్రజలకు తెలుసని.. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నో సమస్యలను పరిష్కరించారనని.. ధర్మం, న్యాయం వైపు తాను నిలబడతానని గవర్నర్ వారితో చెప్పినట్లు సమాచారం. సమస్యలపై ముందే స్పందిస్తానని.. దీనిపై తాను పబ్లిసిటీ చేసుకోలేనని గవర్నర్ అన్నారట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *