సీమాంధ్రులు టీఆర్ఎస్ నే గెలిపిస్తారు..

హైదరాబాద్(ఎ.ఎన్) : ‘హైదరాబాద్ లో ఇప్పటికే 5 సర్వేలు చేశాం.. పోలీస్ వ్యవస్థను , రెండు పడకగదుల ఇళ్లను సహా చాలా అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించాం.. ఖచ్చితంగా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయం’ అన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ లో మీడియాతో ముచ్చటించిన కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు.

లండన్, న్యూయార్క్ ల వలే హైదరాబాద్ కు కూడా నిరంతరం విద్యుత్ సరఫరా కొనసాగేలా చుట్టూ నాలుగు సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం 2080 కోట్లను ఖర్చు చేస్తామని తెలిపారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటిరిగానే బరిలోకి దిగతామని ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ సహా ఏ పార్టీతోనూ పొత్తులండవని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులు సైతం అభివృద్ధి చూసి టీఆర్ఎస్ కే మద్దతిస్తున్నారని కేటీఆర్ చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *