Breaking News

సీతారామ ప్రాజెక్టు పై సమీక్ష: మంత్రులు హరీశ్ రావు, తుమ్మల

సీతారామ ప్రాజెక్టు పై  సమీక్ష: మంత్రులు హరీశ్ రావు, తుమ్మల

కృష్ణాతో గోదావరిని అనుసంధానం చేయనున్న 16 L, 18L కాలువల పనులను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రులు హరీశ్ రావు, తుమ్మల ఆదేశించారు. దీనికి సంబంధించిన సర్వే పనులు ముగించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేయాలని కోరారు. ఖమ్మం జిల్లాలో సీతారామ లిఫ్ట్ పథకం ఫేజ్ 1 లో 3 పంపు హవుజ్ ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని హరీశ్ రావు,తుమ్మల ఆదేశించారు.ఈ సంవత్సరం చివరకు మూడు పంప్ హౌజ్ లు పూర్తి చేయాలన్నారు. సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు చెందిన భూసేకరణ,అటవీపర్యావరణ అనుమతులు,పంప్ హౌజ్ లు,కెనాల్స్ఇతర పనుల పురోగతిపై బుధవారం నాడు జలసౌధలో సమీక్ష నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతి అనుకున్నంత వేగంగా లేకపోవడం,పనులు మందకొడిగా సాగుతున్నాయని అన్నారు. ప్యాకేజీల వారీగా 1,2,3 ప్యాకేజి ల పనులను మంత్రులు సమీక్షించారు.అన్ని పనులను కూడా వెంటనే అగ్రిమెంట్ చేసుకొని ప్రారంభించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. మూడు పంప్ హౌజ్ పనులను ఎప్పటిలోగా పూర్తి చేయనున్నారో తేదీల వారీగా కార్యాచరణ ప్రణాళికను . త్వరలోనే మరోసారి సీతారామ రూపొందించి తెలియజేయాలని హరీశ్ రావు ఆదేశించారు ప్రాజెక్టుపై సమీక్ష జరపనున్నట్టు ఇద్దరు మంత్రులు ప్రకటించారు భూసేకరణ ప్రక్రియ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని హరీశ్ రావు సూచించారు. సమీక్షలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ఖమ్మం సి.ఈ.సుధాకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *