సీజనల్ వ్యాధుల నివారణకు ప్రజల భాగస్వామ్యం అత్యవసరం :కేటీఆర్

సొంత ఇంటి పారిశుద్ధ్య నిర్వహణ పైన ప్రజల భాగస్వామ్యం కోసం ప్రత్యేక డ్రైవ్ ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

*సీజనల్ వ్యాధుల నివారణకు ప్రజల భాగస్వామ్యం అత్యవసరం కేటీఆర్

* ఈ మేరకు ప్రగతి భవన్ భవన్ లో పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు చేపట్టిన కేటీఆర్.

*ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ డ్రైవ్ లో పాల్గొనాలని కోరిన కేటీఆర్

*ప్రతి ఒక్కరు తమ సొంత ఇంటిలోపల..పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరిన మంత్రి

* ఇంటి లోపల పేరుకుపోయిన, వినియోగంలో లేని వస్తువులను తొలగించుకోవాలి

* ఇళ్లలో నీటి తొట్లు, పూలమొక్కలు ఉన్న చోట్లలో నీరు నిలువకుండా చూడాలి

* ప్రజల భాగస్వామ్యంతో సీజనల్ వ్యాధుల నివారణ సులభమవుతుందన్న మంత్రి

* ప్రతి ఒక్కరూ తమ సొంత ఇంటి పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని పిలుపు

సీజనల్ వ్యాధుల నివారణ ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. జన సమర్థ ప్రదేశాలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసి తరుపున దోమల నివారణతో పాటు పరిశుభ్రత నిర్వహణ చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపిన కేటీఆర్.. ప్రతి ఒక్కరూ తమ సొంత ఇళ్లలో పారిశుద్ధ్య నిర్వహణ పైన దృష్టి సారించి ప్రభుత్వ ప్రయత్నాలతో కలిసి రావాలన్నారు. ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు సొంత ఇళ్లలోని పారిశుద్యం అత్యంత కీలకమైన అంశం అన్నారు. నిన్న జిహెచ్ఎంసి కార్యాలయంలో సీజనల్ వ్యాధుల పైన వైద్య శాఖ మంత్రి మరియు వైద్య శాఖ అధికారులు, పురపాలక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం సొంత ఇళ్ళలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ డ్రైవ్ లో ప్రజలను చైతన్యవంతం చేసి పారిశుద్ద్యం నిర్వహణలో వారిని భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వ అధికారులు, పురపాలక ప్రతినిధులు తమ సొంత ఇళ్ళలోని పారిశుధ్య నిర్వహణ చేపట్టి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని కోరారు.

ktr 1

ఈ మేరకు మంత్రి కేటీఆర్ తన నివాస గృహం ప్రగతి భవన్ లోని పారిశుద్ధ్య నిర్వహణ పైన దృష్టిసారించారు. ముఖ్యంగా దోమల వృద్ధికి అవకాశం ఉన్న ఉన్న నీటి తొట్లు, మరియు నీటి నిలువ ప్రదేశాల్లో నీటిని తొలగించే చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు ఇంటి మూలల్లో ఉన్న ఉపయోగంలో లేని వస్తువులను తీసివేసి దోమల లార్వా వృద్ధికి అవకాశం లేకుండా చేసే చర్యలను చేపట్టారు. ఈ మేరకు ప్రగతి భవన్ లోని నీటి తొట్లలో ఆయన నూనె వేశారు. ప్రతి ఒక్కరూ స్వంత ఇంటి పారిశుద్ధ్య నిర్వహణ పైన పైన దృష్టి సారించి సీజనల్ వ్యాధుల బారి నుంచి కాపాడుకునే ప్రయత్నం ప్రారంభించాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇళ్ళ ముందు కానీ లేదా ఇంటి లోపల నీటి నిలువ ఉండే ప్రాంతాల్లో నీటిని తొలగించే ప్రయత్నం చేయడం లేదా వాటిపైన నూనెను చల్లడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. దీంతోపాటు ఇళ్లలో ఉన్న పనికిరాని లేదా ఉపయోగం లేని లేని వస్తువులను తొలగించుకోవాలని కోరారు. కేటీఆర్ వెంబడి నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు శాసన సభ ప్రభుత్వ విప్ బాల్కసుమన్ కూడా ఉన్నారు. మంత్రి ఇచ్చిన పిలుపుమేరకు తాము కూడా సొంత ఇంటి పారిశుద్ధ్య నిర్వహణ పైన అవసరమైన చర్యలు చేపడతామని వారిరువురు మంత్రి కేటీఆర్ గారికి తెలిపారు.

ktr 2     ktr 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *