సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు

కరీంనగర్: జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేటులోని మంధని, మంధని ముత్తారం, మలహర్ రావు ప్రాంతాలలో అందిస్తున్న వైద్య సేవల పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు. వ్యాధులు వ్యాపించే గ్రామాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో 3 రోజులు, 3 పూటలు స్పేృ చేయించాలని డి.ఎం.హెచ్.ఓ.ను, డి.పి.ఓ.ను ఆదేశించారు. గ్రామాలలో వైద్య క్యాంపులను నిర్వహించాలని అన్నారు. అవసరమైన మందులను ప్రాధమిక వైద్య కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని అన్నారు. బెగులూర్ గ్రామంలో డెంగ్యు సోకిన వారిని గుర్తించి జిల్లా ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 32 డెంగు పాజిటివ్ కేసులను గుర్తించినట్లు తెలిపారు. అందులో 22 బెగులూర్ గ్రామం నుండి ఉన్నారని తెలిపారు. బెగులూర్ గ్రామంలో వ్యాధులను అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రత్యేక వైద్య బృందాల పర్యవేక్షణలో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 22 కేసులను జిల్లా ప్రభుత్వ వైద్యశాల కరీంనగర్ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం ఏమి లేదని తెలిపారు. గత రెండు రోజులుగాఎటువంటి డెంగ్యు కేసులు జిల్లాలో నమోదు కాలేదని తెలిపారు. ప్లెట్ లేట్లు పడిపోయిన 2 కేసులను గుర్తించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. నేటికి జిల్లా ఆస్పత్రిలో 20 డెంగ్యు కేసులను చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

రోజుకు 20 బ్లెడ్ సాంపుల్స్ అవసరం:

జిల్లాలో ప్రస్తుత సీజన్ లో రోజుకు 20 బ్లెడ్ సాంపుల్స్ అవసరం అవుతాయని అన్నారు. అవసరమైన రక్తం జిల్లా ఆస్పత్రిలో అందుబాటులో ఉందని అన్నారు. సిఇఓ స్టెప్ కార్ ప్రతిరోజు రక్తదాన శిబిరాలను నిర్వహించి జిల్లా ఆస్పత్రికి సరఫరా చేయాలని కోరారు. ప్రతిరోజు రక్తం అవసరమవుతుందని అన్నారు. జిల్లా ఆస్పత్రిలో రక్తానికి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో ఇంటెన్సిటివ్ చైల్డ్ కేరు యూనిట్ నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టాలని డి.ఎం.హెచ్.ఓ.ను కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి. వీరబ్రహ్మయ్య, సిపిఓ సుబ్బారావు, డి.ఆర్.డి.ఎ. పిడి అరుణశ్రీ, జిల్లా వైద్యాధికారి డా.రాజేశం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *