Breaking News

సీఎం హామీ బుట్టదాఖలైంది.. తండ్రి అసువులు బాశాడు..

SUICIDE

మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం లింగారెడ్డిపల్లిలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లల తండ్రి.. వృద్ధురాలైన తల్లిని సాకే స్థోమత లేక.. ప్రభుత్వం ప్రకటించిన సాయం అందక దిక్కుతోచని మచ్చ స్వామి(32) ఆత్మహత్య చేసుకున్నాడు..

స్వామి, సుజాతలు దినసరి కూలీలు.. ఈ ఏడాది జనవరి 26న మూడోకాన్పు కోసం సుజాత గజ్వేల్ లోని ప్రభుత్వానికి వెళ్లగా  మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె శస్త్రచికిత్స విఫలమై  మృతి చెందింది.  అప్పుడు ఆందోళన చేస్తే నష్టపరిహారం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. 4 నెలలుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు.  మే 24న కేసీఆర్ ను ఫాంహౌస్ లో కలిసి గోడు వెల్లబోసుకున్నాడు.  సీఎం ఆదేశాలతో పిల్లల్ని కస్తూర్భా పాఠశాలలో చేర్పించారు అధికారులు. కానీ ప్రభుత్వ సాయం అందకపోవడం మనస్థాపానికి గురై స్వామి  బుధవారం భార్య సమాధి వద్దకు వెళ్లి గ్రామస్థులకు ఫోన్ చేసి సుసైడ్ చేసుకున్నాడు. గ్రామస్థులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.. పాపం స్వామి అసువులు బాసాడు..