సీఎం పోస్టుకు రూ.4.21 లక్షలు..

ఏంటీ హెడ్డింగ్ చూసి సీఎం పోస్టు అంత చీప్ అని అనుకుంటున్నారా.. కాదు కాదు.. మన రాష్ట్రాన్ని పాలించే సీఎంకు మనమందరి కలిసి ఇచ్చే జీతం నెలకు రూ.4.21 లక్షలన్నమాట.. ప్రజాప్రతినిధులైన  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్, చీఫ్ విప్, మంత్రులు, స్పీకర్, సీఎం తదితరుల జీతాలు వాళ్లకు వాళ్లే పెంచుకునేందుకు రంగం సిద్దమైంది.

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు నేడు శాసనసభ ఆమోదం తెలుపనుంది. ఇది గనుక ఆమోదం పొందితే ఇక ప్రజాప్రతినిధుల జీతాలు భారీగా పెరగనున్నాయి.. ఎమ్మెల్యే జీతం ఇప్పుడున్న 95 వేల రూపాయల నుంచి 2.5లక్షలకు.. పెరగనుంది.. దీంతో తెలంగాణ ప్రజాప్రతినిధుల పంట పండినట్టే అయ్యింది..

జీతాలు పెరుగుదల ఎవరికెంత..?

  • ఎమ్మెల్యే జీతం -2.5 లక్షలు
  • మంత్రులు, చీఫ్ విప్, విప్ లకు – రూ. 4 లక్షలు
  • స్పీకర్ కు -రూ. 4.11 లక్షలు
  • ముఖ్యమంత్రికి -4.21

ఇవేకాకుండా మాజీ ప్రజాప్రతినిదులకు ఇచ్చే పించన్ ను రూ.15 వేల నుంచి 50 వేలకు పెంచారు. ఇక రోగాల పాలైతే ఆరోగ్య చికిత్స కోసం రూ. 5 లక్షల బీమా సదుపాయం కల్పించారు. ఎమ్మెల్యే, మంత్రులు,సీఎంలకు   కారు కొనుగోలు  కోసం రుణపరిమితి రూ.15 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారు.

ఇదీ మన తెలంగాణ లో గెలిచిన ప్రజాప్రతినిధులకు పట్టిన సుడి.. ఇంతకంటే భాగ్యం ఏముంటుంది. ఏ సాఫ్ట్ వేర్ జాబ్ చేసినా రాని జీతం వీరికి నెలనెలా వస్తోంది.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *