
తెలంగాణ కేబినెట్ సమావేశం శనివారం మధ్యాహ్నం మొదలై రాత్రి వరకు కొనసాగింది.. ఇంత సుధీర్ఘ సమావేశంలో కేసీఆర్ వివిధ తెలంగాణలోని సమస్యలపై చర్చించారట.. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు, వరంగల్ ఎన్ కౌంటర్ పై చర్చ జరిగిందట.. రైతుల్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు.. నక్సల్ ఎజెండా అని నక్సల్స్ నే తెలంగాణలో చంపడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసిన సంగతి తెలిసిందే..
దీంతో కేసీఆర్ ఇవాళ కేబినెట్ సమావేశం ముగియగానే ముఖం చాటేశాడు.. విలేకరులు వీటిపై నిలదీస్తారని తెలిసి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని విలేకరులకు పంపి వెనకడుగు వేశారు.. మొదటిసారి కేసీఆర్ భయపడ్డాడు.. ఎప్పుడు కేబినెట్ సమావేశ వివరాలు చెప్పే కేసీఆర్ ఈసారి కడియంకు ఆ బాధ్యత అప్పగించడంతో విమర్శలకు సమాధానం చెప్పలేక ఇలా చేశాడని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..