
హైదరాబాద్, ప్రతినిధి : ‘నా పేరు కేసీఆర్.. నా నంబర్ 040-23454071 అంటూ వరంగల్ పర్యటనలో ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన నెంబర్ కు అద్భుత స్పందన లభిస్తోంది. 24 గంటల్లోనే ఈ నెంబర్ కు 2,545 ఫోన్లు వచ్చాయి. ఇంతలా అవినీతి, అసమర్థంగా పనిచేస్తున్నారా అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వేగంగా స్పందించిన సీఎం కేసీఆర్ 30 లైన్లతో ఉన్న 040-23454071 నంబర్ కు అదనంగా మరో 30 లైన్లు పెంచాలని.. అదనంగా ఈ-మెయిల్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఈ ఫోన్ లైన్లు రిసీవ్ చేసుకునేందుకు వీలుగా 160మందిని సైతం నియమించారు.
సంక్షేమ కార్యక్రమాలను ఉరుకులను పెట్టాలని.. ప్రయత్నిస్తున్న సీఎం కేసీఆర్ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఐఏఎస్, ఐపీఎస్ ల విభజన పూర్తి కావడంతో ఇక పాలనపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ప్రత్యేక నంబర్ ను ప్రజల కోసం అందుబాటులో ఉంచారు. దీనిపై ప్రజల నుంచి భారీ స్పందన రావడంతో దాన్ని మరింత విస్తరించేందుకు పూనుకున్నారు.