సీఎం కేసీఆర్ కోసం బుల్లెట్ ఫ్రూఫ్ బస్

సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడల్లా హెలీ కాప్టర్ నే వినియోగిస్తున్నారు. దాని ఖర్చు తడిసి మోపడవుతోంది. దాంతో పాటు వాతావరణ మార్పులతో ప్రయాణం ఆలస్యం అవుతోంది. కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడే అవకాశం కూడా ఉంది. దీంతో ఆయన జిల్లాల పర్యటనలు, సమస్యాత్మక గ్రామాల పర్యటనల కోసమని తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఒక బుల్లెట్ ఫ్రూవ్ బస్సును తయారుచేయించింది.

చండీఘడ్ లోని బెంజ్ బస్సుల ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించిన ఈ బస్సులో రాజభోగాలున్నాయి. ఇంటిని మరిపించేలా సకల సౌకర్యాలున్నాయి. ఫుల్ ఏసీ ఒక బెడ్ రూమ్, బాత్ రూమ్, కాన్ఫరెన్స్ హాల్, కిచెన్, టీవీ, ఇంటర్ నెట్ తదితర అన్ని సౌకర్యాలున్నాయి. దీన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం సీఎం కోసమే ప్రత్యేకంగా తయారు చేయించింది. ధర ను మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. బుల్లెట్ ఫ్రూఫ్ కావడంతో విపత్తునుంచి రక్షణ సాధ్యమవుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *