సీఎం కేసీఆర్ కు అరుదైన గౌరవం

సీఎం కేసీఆర్ కు అరుదైన గౌరవం లభించింది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం అందరి ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే.. దేశ విదేశాల్లో ఈ పథకాన్ని అందరు నాయకులు, నిపుణులు, దిగ్గజాలు మెచ్చుకున్న సంగతి తెలిసిందే.. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది..

ఏప్రిల్ 4న కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వరల్డ్ వాటర్ వీక్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి కోరారు. ఈ మేరకు కేసీఆర్ కు ఇవాళ ఫోన్ చేసి సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *