సీఎం ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లాలో పర్యటించిన హైదరాబాద్ ఉన్నతాధికారుల బృందం

సీఎం ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లాలో పర్యటించిన హైదరాబాద్ ఉన్నతాధికారుల బృందం

సీఎం సొంత నియోజకవర్గంలో జరుగుతున్న పచ్చదనం తో పాటు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించిన వివిధ శాఖల అధికారులు. అటవీశాఖ నేతృత్వంలో చేపట్టిన హరితహారం, అటవీ పునరుద్ధరణ, అవెన్యూ ప్లాంటేషన్, అర్బన్ పార్కుల ఏర్పాటు పనుల పరిశీలన.  పర్యటనలో పాల్గొన్న అటవీ, మున్సిపల్, పర్యాటక, Ghmc, Hmda, Tsiic, గజ్వెల్ ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు.  సింగాయపల్లి, గౌరారం, కోమటి బండ, సంగాపూర్ ప్రాంతాల్లో పర్యటించిన అధికారుల బృందం. హైదరాబాద్ తో సహా, Hmda పరిధి, రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనంతో పాటు, అర్బన్ పార్క్ లు, స్మృతివనంల అభివృద్ధి పై అధ్యయనం. పెరిగిన నగర జీవనం నుంచి ఉపశమనం కోసం పచ్చదనం అవసరమని, వీలైనంత చెట్లు పెంచాలనే సీఎం ఆశయం అమలు చేసే దిశగా అధికారుల   అధ్యయనం రోజంతా కొనసాగింది.  కోమటి బండ లో హరితహారం ఫలితాలను చూసి ప్రశంసించిన ఇతర శాఖల అధికారులు.  సహజ పద్ధతుల్లో అటవీ పునజ్జీవన కోసం తీసుకుంటున్న చర్యలు, ఫలితాలను పరిశీలించిన అధికారులు, ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.  అటవీ భూములు, రిజర్వు ప్రాంతాల్లో సరిహద్దులపై గచ్చకాయ చెట్లు పెంచటం వల్ల పశువులు, ఆక్రమణలను నియంత్రణ చేపట్టారు.  కందకాలు ( ట్రెంచ్ లు) తవ్వటం వల్ల అటవీ భూముల్లోకి ఇతరులు వెళ్లకుండా చేసిన చర్యలను అధికారులు చూసారు.  ములుగులో భారీ ఎత్తున నిర్మాణంలో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ను ఈ బృందం పరిశీలించింది.  అటవీశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ మాట్లాడుతూ సీఎం ఆదేశాలతో అధికారుల బృందం పర్యటించిందని, ఈ అనుభవంతో అన్ని శాఖల సమన్వయంతో పచ్చదనం అభివృద్ధి రాష్ట్రవ్యాప్తంగా చేస్తామన్నారు. Hmda కమిషనర్ చిరంజీవులు.. అటవీశాఖ చర్యలను మెచ్చుకొన్నారు. Hmda పరిధిలో ఉన్న 194 ఆటవీ బ్లాక్ లను అభివృద్ధి చేసి లంగ్ స్పేస్ లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.  గజ్వెల్ మోడల్ గ్రీనరీ హైదరాబాద్ తో సహా తెలంగాణ ఇతర ప్రాంతాల్లో చేపట్టేందుకు అధికారుల బృందం పర్యటన వల్ల ఉపయోగ పడుతుందని సీఎం osd ప్రియాంక వర్గీస్ తెలిపారు.

hmda officeres new     komatibanda new

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *