
హైదరాబాద్ , ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని పరిధిలోని అన్ని ప్రాంతాలను సీఆర్డీఏ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ను జనవరి మొదటివారంలో విడుదల చేయనున్నారు. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తారు.
అలాగే రాజధాని నిర్మాణానికి వేసిన సింగపూర్-ఏపీ ప్రభుత్వాల సమన్వయ కమిటీలో సింగపూర్‌కు చెందిన ముగ్గురు సభ్యులు, ఏపీకి చెందిన ముగ్గురు సభ్యులుంటారు. ఏపీకి చెందిన ప్లానింగ్ కమిటి ముఖ్యకార్యదర్శి పక్కర్, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌లకు ఇందులో చోటు దక్కింది.