
ముఖ్యమంత్రి సహయ నిధి నుండి మంజూరు అయిన 2.70 లక్షల విలువ గల 9 చెక్కులను సోమవారం ఉదయం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర్ర ఆర్ధిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పంపిణి చేశారు. హుజూరాబాద్ మండలంనకు చెందిన కుమారస్వామికి 33వేలు, జమ్మికుంట మండలానికి చెందిన పి.సమ్మయ్య కు 14,500, జె.శ్రీలతకు 15,000, కె.రవీందర్ రెడ్డికి 37,500, యం.లక్ష్మీకి 49వేలు, వేశావంక మండలానికి చెందిన కె.రాజమౌళికి 73,500, పి.స్వామికి 23,000, కమలాపూర్మండలానికి చెందిన జి.లలితకు 10,000, బి.రాధికకు 10వేల చొప్పున చెక్కులు అందిజేశారు. ఈ కార్యక్రమంలో లబ్బిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.