సిసి కెమెరాల ఏర్పాటుకు 35 లక్షల విరాళం

police pro

కమీషనరేట్ పరిధిలో 10 వేల సిసి కెమెరాల ఏర్పాటుతో ముందుకు సాగుతున్న పోలీస్ శాఖకు అన్ని వర్గాలు తమవంతు సహకారం అందిస్తున్నాయి. నగరంలోని వైద్యులు, ప్త్ర్రెవేటు ఆసుపత్రుల నిర్వాహకులు సిసి కెమెరాల ఏర్పటుకు 35 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. ఈ మేరకు కమీషనర్ సమక్షంలో సిసి కెమెరాల ఏర్పాటు సంస్ధకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కమీషనరేట్ కేంద్రంలోని దివంగత ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హల్లో ఏర్పాటైన కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ సిసి కెమెరాల ఏర్పాటుకు అన్ని వర్గాల ప్రజలు తమవంతు సహకారం అందించేందుకు ముందుకురావడం ఆహ్వనించదగిన పరిణామమన్నారు. నేరాల నియంత్రణ, చేధనకు సిసి కెమెరాలు దోహదపడుతాయని చెప్పారు. నగరంలోని వైద్యులు, ప్త్ర్రెవేటు ఆసుపత్రుల విరాళలతో తొలివిడతగా 43 కెమెరాలను నగరంలో డాక్టర్స్ స్ట్ర్రిట్, ఐబి చౌరస్తా, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, నుండి అపోలో ఆసుపత్రి వరకు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పూర్తి నాణ్యత ప్రమాణాలతో కూడిన కెమెరాలను అమర్చనున్నామని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో నగరంలో పలు నేరాల సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కమీషనరేట్ పరిధిలో సినిమాహళ్ళు, ఫంక్షన్ హళ్ళు, విద్యాసంస్ధలు, వ్యాపార, వాణిజ్య సంస్ధల కూడళ్ళలో సిసి కెమెరాల ఏర్పాటు కోసం నోటీసులు జారీ చేశామని చెప్పారు. నిర్ణితకాలంలోపు సిసి కెమెరాలను ఏర్పాటు చేయలేకపోయినట్లయితే సదరు సంస్ధలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సిపి టి.అన్నపూర్ణ, ట్ల్ర్రెనీ ఐపిఎస్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఎసిపి జె.రామారావు, టూటౌన్ ఇన్స్ పెక్టర్ హరిప్రసాద్ వైద్యులు భాగ్యారెడ్డి, మహ్మద్ ఆలీ, సాగర్ రావు, మాటూరి శ్రీనివాస్, త్రినాధ్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *