సిసిఐ కనీస మద్ధతు ధర పై పత్తి కొనుగోలు: టి.హరీష్ రావు

కరీంనగర్: కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా రాష్ట్ర్రానికి మంజూరు అయిన పత్తి కొనుగోలు సెంటర్లన్నింటిని వెంటనే ప్రారంభించి కనీస మద్ధతు ధర పై పత్తిని కొనుగోలు చేయాలని రాష్ట్ర్ర మార్కెటింగ్, నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. బుధవారం కలెక్టరేటు నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు మార్కెటింగ్ అధికారులు సిసిఐ అధికారులతో పత్తి కొనుగోలు పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరం రాష్ట్ర్రంలో 84 సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1,45,215 క్వింటళ్ళ పత్తిని కనీస మద్దతు ధర పై కొనుగోలు చేశారని అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర్రంలో 84 కేంద్రాలకు గాను
24 మాత్రమే ప్రారంభించి కేవలం 38,000 క్వింటళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారని అన్పారు. దీని ద్వారా మార్కెట్ యార్డులలో రైతులకు కనీస మద్దతు ధర లభించక రైతులకు ధర్నాలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిసిఐ కేంద్రాలలో పత్తి కొనుగోలు చేయుటకు కొన్ని కేంద్రాలలో సిబ్బందిని నియమించలేదని వెంటనే తగిన సిబ్బందిని నియమించాలని సిసిఐ అధికారులను కోరారు. రాష్ట్ర్రంలో ఇంతవరకు 95 శాతం పత్తిని ప్త్ర్రెవేటు ట్రేడర్స్ కొనుగోలు చేస్తే సిసిఐ ద్వారా కేవలం 5 శాతం మాత్రమే కొనుగోలు చేశారని ఇది చాలా తక్కువని సిసిఐ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఇంతవరకు ఒక క్వింటాళ్లు కూడా కొనుగోలు చేయలేదని అన్నారు. కొన్ని జిన్నింగ్ మిల్లులను సిసిఐ ఇంతవరకు నోటిఫై చేయలేదని వెంటనే నోటిఫై చేయాలని అధికారులను కోరారు. జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేస్తే పత్తి కొనుగోలు వేగం పుంజుకుంటుందని సూచించారు. పత్తి కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల్లో ఆన్ లైన్ పేమెంట్ జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోల్ల పై జాయింట్ కలెక్టర్లు ప్రతి రోజు మార్కెటింగ్ అధికారులు సిసిఐ అధికారులతో మానిటర్ చేసి పత్తి కొనుగోల్లలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని సూచించారు. అధికారులు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మార్కెటులో రైతులకు అందుబాటులో ఉండి పత్తి కొనుగోలు చేయాలని సూచించారు. సిసిఐ అధికారులను రైతులు గుర్తించేందుకు వీలుగా ప్రత్యేకమైన యూనిఫాం ధరించాలని సూచించారు. అధికారులందరు కేంద్ర స్ధానంలో నివాసం ఉంటూ పత్తి
కొనుగోల్లకు పర్యవేక్షించాలని సూచించారు. పత్తి రైతులకు గుర్తింపు కార్డుల పంపిణి పూర్తి చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. రైతులు తెచ్చిన పత్తి మొత్తాన్ని కొనుగోలు చేయాలని ఎలాంటి పరిమితి లేదని అన్నారు. రైతులు మార్కెటింగ్ యార్డుల వరకు పత్తిని తీసుకువచ్చుటకు రవాణా చార్జీలు భరిస్తారని, పత్తి కొనుగోలు తర్వాత మార్కెట్ నుండి జిన్నింగ్ మిల్లు వరకు రవాణా చార్జీలు సిసిఐ వారే భరించాలని సూచించారు. ఇట్టి విషయాన్ని పై అధికారులతో చర్చిస్తామని తెలిపారు. ఎట్టి పరిస్ధితులలో పత్తిని కనీస మద్దతు ధర పై కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మొక్కజొన్న ధాన్యం
కొనుగోలు కేంద్రాలను అవసరం మేరకు ఎక్కువ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఐకెపి కేంద్రాల ద్వారా కనీస మద్ధతు ధర పై ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. ఐకెపి కేంద్రాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోల్లు ఐకెపి సెంటర్ల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ, రాష్ట్ర్ర సాంస్కృతి సారధి రసమయి బాలకిషన్, సిసిఐ వరంగల్ బ్రాంచ్ మేనేజర్ విశాల్, పిడి డిఆర్ డిఎ అరుణశ్రీ, మార్కెటింగ్ ఎడి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *