సివిల్ వివాదంలో ఖాకీలు

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు.. భక్షకులుగా మారుతున్నారు. సివిల్ వివాదంలో జోక్యం చేసుకుని ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు… తమ మాట వింటే సరీ.. లేదంటే కింద స్థాయి సిబ్బందితో చితకబాదిస్తున్నారు. విషయం బయటికి పొక్కితే.. కేసులు పేడతామని బెదిరిస్తున్నారు. ఇటీవల సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో సివిల్ వివాదాలతో వరుసుగా పోలీసులు అధికారులు సస్పెండ్ అయ్యిన సంఘటనలు మరువకముందే తాజాగా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఓ సివిల్ వివాదం కేసుల్లో ఏసీపీతోపాటు ఇద్దరు ఎస్సైలపై కేసులు నమోదు కావడం పోలీసు డిపార్టుమెంట్ లో సంచలనం రేపుతోంది.సమాజంలో వారు చాలా కీలకం.. చీమ చిటుక్కుమన్నా.. చిన్న ఆందోళన జరిగినా..అన్యాయం జరిగినా.. అపద వచ్చినా..శాంతి భద్రతలకి ఆటంకం కలిగినా..మేమున్నామంటూ భరోసా ఇస్తారు..అలాంటి ది గ్రేట్ పోలీస్ డిపార్ట్ మెంట్లో తులసి వనంలో గంజాయి మొక్కల్లా తలవంపులు తెచ్చిపెడుతున్నారు కోందరు పోలీసులు.తులసి వనంలో గంజాయి మొక్కల్లా పోలీస్ శాఖలో కోందరు ఖాకీ డ్రెస్ ని అడ్డంపెట్టుకుని సెటిల్మెంట్లు, దందాలకి తెరలేపుతున్నారు..కంచే చేను మేసిందన్నట్టు ప్రజలకి రక్షణగా ఉండాల్సిన పోలీసులే భక్షకులు మారుతున్నారు..ఓ వైపు సర్కార్ ఫ్రెండ్లీ పోలీసింగ్, అవినీతి రహిత పోలీసింగ్ దిశగా సంస్కరణలు చేపడుతుంటే.. అవేం పట్టవన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కొందరు.ఇటీవల సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో సివిల్ వివాదాలతో వరుసుగా పోలీసులు అధికారులు సస్పెండ్ అయ్యిన సంఘటనలు మరువకముందే తాజాగా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఓ సివిల్ వివాదం కేసుల్లో ఏసీపీతోపాటు ఇద్దరు ఎస్సైలపై కేసులు నమోదు కావడం పోలీసు డిపార్టుమెంట్ లో సంచలనం రేపుతోంది. సంతోష్ రెడ్డి అనే వ్యక్తి మీర్ పేట్ పిఎస్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి జీవన్ ప్రసాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. జీవన్ ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. దీంతో సంతోష్ రెడ్డి ఓ ప్లాట్ కొనుగోలు చేసేందుకు జీవన్ ప్రసాద్ కి సుమారు కోటీ వరకు ఇచ్చాడు. కానీ జీవన్ ప్రసాద్.. సంతోష్ రెడ్డికి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తున్నాడు. దీంతో సంతోష్ రెడ్డి… జీవన్ ను గట్టిగా నిలదీయంగా… ఈ సివిల్ వివాదాన్ని… అప్పటి రాచకొండ క్రైం ఏసీపీ గా ఉన్న రాములు నాయక్ దృష్టికి తీసుకెళ్లి సెటిల్ మెంట్ చేయమని జీవన్ చెప్పాడు. దీంతో ఎస్సైలు సైదులు, రాథోద్ సహాకారంతో ఏసీపీ రాములు నాయక్ సంతోష్ రెడ్డిని తన ఆపీస్ కు పిలుపిచుకుని వార్నింగ్ ఇవ్వడంతో చితకబాదాడు. ఇదే విషయాన్ని బాదితుడు రాచకొండ సీపీ కి పిర్యాదు చేయడంతో… ఇంటర్నల్ గా దర్యాప్తు చేయించారు. సివిల్ వివాదంలో తలదూర్చినట్లు తేలడంతో ఏసీపీతోపాటు ఇద్దరు ఎస్సైలను బదిలీ చేశారు సీపీ.అయితే జీవన్ ప్రసాద్ తోపాటు పోలీసులపై ఎలాంటి కేసులు పెట్టకపోవడంతో బాదితుడు హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఆదేశాలమేరకు మీర్ పేట్ పోలీసులు.. జీవన్ ప్రసాద్ తోపాటు ప్రస్తుతం అదిలాబాద్ బెటాలియన్ డీఎస్పీగా ఉన్న రాములు నాయక్, ఎస్సైలు సైదులు,రాథోడ్ లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని బాదితుడి సంతోష్ కోరుతున్నారు.బాదితుడు సంతోష్ రెడ్డి.అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే హడాహుడిగా ఎంక్వేరీలు చేస్తాం.. బాదిత కుటుంబాలకు న్యాయం చేస్తాం.. భాద్యులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్న పోలీస్ బాసులు.. ఆతర్వాత సైలెంట్ గా ఎంక్వేరీ రిపోర్టులు మూలకుపడిపోతున్నాయన్న విమర్షలు వినిపిస్తున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *